3డిలో తయారైన తొలి పౌరాణికం ‘కురుక్షేత్రం’


3డిలో తయారైన తొలి పౌరాణికం 'కురుక్షేత్రం'

3డిలో తయారైన తొలి పౌరాణికం ‘కురుక్షేత్రం’

భారతీయ ఇతిహాసాల్లో ‘మహాభారతం’ సుప్రసిద్ధం. పంచమవేదంగా ఖ్యాతిపొందిన ఆ మహాభారతం మొత్తమ్మీద దాయాదులైన పాండవులు, కౌరవుల మధ్య జరిగిన ‘కురుక్షేత్రం’ యుద్ధం అత్యంత కీలక ఘట్టం. తెలుగులో ఆ ఘట్టాన్ని ఆధారం చేసుకొని ‘దానవీరశూరకర్ణ’, ‘కురుక్షేత్రం’ వంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు కన్నడంలో ఆ యుద్ధం ప్రధానంగా ఒక చిత్రం రూపొందింది. కర్ణునిగా అర్జున్, దుర్యోధనునిగా దర్శన్, అర్జునునిగా సోనూ సూద్, ద్రౌపదిగా స్నేహ, కృష్ణునిగా రవిచంద్రన్, అభిమన్యునిగా నిఖిల్ గౌడ నటించిన ఈ చిత్రం తెలుగులో ‘కురుక్షేత్రం’ పేరుతో రాబోతోంది. దీనికి సంబంధించిన ఇంకో విశేషం ఇది 3డి ఫార్మట్‌లో రానుండటం. ఆ ప్రకారం చూస్తే ప్రపంచంలోనే 3డి ఫార్మట్‌లో రానున్న తొలి పౌరాణిక చిత్రంగా ‘కురుక్షేత్రం’ నిలవనున్నది.

తెలుగు, క‌న్న‌డ బాష‌ల్లో ఎన్నో చిత్రాలు నిర్మించి దక్షిణాది అగ్ర నిర్మాతల్లో ఒకరిగా పేరుగాంచిన రాక్‌లైన్‌ వెంక‌టేష్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నాగన్న దర్శకత్వంలో వృష‌భాద్రి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మునిర‌త్న (ఎంఎల్ఎ) ఈ చిత్రాన్ని నిర్మించమే కాకుండా ఈ చిత్ర క‌థ‌ని కూడా అందించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్ర‌ముఖ నిర్మాత‌లు బివిఎస్ఎన్ ప్ర‌సాద్‌, బ‌న్నీవాసు చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుద‌ల చేశారు.

Here’s the trailer for you:

ఈ సంద‌ర్భంగా బివిఎస్ఎన్ ప్ర‌సాద్ మాట్లాడుతూ… “నేను ఎప్ప‌టి నుంచో భార‌తాన్ని 3డిలో చేయాల‌నుకున్నాను. నేను భావించిన‌ట్లే 3డిలో మొట్ట‌మొద‌టిసారి ఆల్ ఓవ‌ర్ ఇండియాలో ఈ కురుక్షేత్రం విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది” అన్నారు.

బ‌న్నీ వాసు మాట్లాడుతూ.. “ఈ క‌థ‌ని 3డిలో తియ్యాల‌ని ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే ఆలోచ‌న‌ రాక్‌లైన్ వెంక‌టేష్ గారికి, నిర్మాత మునిరత్నం గారికి రావ‌టం, ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇంత భారి ప్రోజెక్ట్ ని తెర‌కెక్కించడం గొప్ప విషయం. వాళ్లకు నా అభినందనలు. ఎందుకంటే రామాయ‌ణం, భార‌తం లాంటివి నేటి యువతరానికి తెలియవు. వాళ్లకు ఎవెంజ‌ర్స్‌, హ‌ల్క్ లాంటి హాలీవుడ్‌లో వచ్చే సినిమాలు, కేరక్టర్లే తెలుసు. మ‌న భార‌తంలో కూడా హ‌ల్క్ లాంటి బ‌ల‌మైన‌వాళ్ళు, అంతకంటే గొప్పవాళ్లు ఉన్నార‌ని తెలియ‌దు. నేను నా పిల్ల‌ల‌ను త‌ప్ప‌కుండా ఈ సినిమాకి తీసుకువెళ్ళి చూపిస్తాను” అని అన్నారు.

ప్రొడ్యూస‌ర్ మునిర‌త్న మాట్లాడుతూ.. “ఈ సినిమాని కొంత మంది ‘దాన‌వీర‌శూరకర్ణ’ చిత్రంతో పోలుస్తున్నారు. ‘దాన‌వీర‌శూరకర్ణ’ అనే చిత్రం ఒకే సారి పుట్టింది, ఇంక రాదు. కాని ‘ బాహుబలి’ లాంటి చిత్రాలు చేయ‌వ‌చ్చు. ఎవ‌రు చేసినా అది మ‌న ఆడియ‌న్స్ ని ఎంట‌ర్‌టైన్ చేయ‌టం కొస‌మే. కాని ఈ చిత్రం ఎంట‌ర్‌టైన్ కోసం, ఈ తరానికి మ‌హ‌భార‌తాన్ని తెలియ‌జేయ‌టం కోసం ‘కురుక్షేత్రం’ చేస్తున్నాం. క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీ చాలా చిన్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సోనూసూద్ అర్జున్ గా న‌టించాడు. అలాగే మా ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శన్ దుర్యోధ‌నుడిగా చాలా బాగా చేశాడు. అర్జున్ ని క‌ర్ణుడిగా చూపించాం. ఇంకా ర‌విచంద్రన్‌ కృష్ణుడుగా, కీర్తిశేషులు అంబరీష్ గారు భీష్ముడిగా న‌టించారు. ఐదు భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది” అని చెప్పారు.

సోనూసూద్ మాట్లాడుతూ… “ఈ చిత్రంలో న‌టించ‌డం నాకు ఒక యాక్ట‌ర్‌గా చాలా మంచి ఎక్స్‌పీరియ‌న్స్ వ‌చ్చింది. ఎన్ని చిత్రాల్లో న‌టించినా ఈ చిత్రంలో చెయ్య‌డం చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నా. చాలా మంచి మైథ‌లాజిక‌ల్ క్యారెక్ట‌ర్ చెయ్య‌డం ఆనందంగా ఉంది. తెలుగు సినిమా చాలా పెద్ద‌ది. ఇక్క‌డ ప్రేక్ష‌కులు కూడా న‌న్ను ఎంతో బాగా ఆద‌రిస్తారు” అన్నారు.

హీరో అర్జున్ మాట్లాడుతూ… “ఇంత మంచి పౌరాణిక చిత్రంలో న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూస‌ర్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా చాలా బాగా తీశారు. సినిమాలో నా క్యారెక్ట‌ర్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. అన్ని ర‌సాలు ఉన్న పాత్ర నాది. సినిమాని అంద‌రూ త‌ప్ప‌కుండా చూడండి. మీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కి ఏమాత్రం త‌గ్గ‌దు” అని చెప్పారు.

డైరెక్ట‌ర్ నాగ‌న్న మాట్లాడుతూ… “నిర్మాత మునిర‌త్న‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా చాలా బాగా తీశారు. మ‌న భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టిసారిగా మైథ‌లాజిక‌ల్ ఫిల్మ్ ని 3డిలో సినిమా చేసిన క్రెడిట్ ఆయ‌న‌కే ద‌క్కుతుంది. కురుక్షేత్రం చిత్రం అంటేనే పండ‌గ‌లా ఉంటుంది” అన్నారు.

3డిలో తయారైన తొలి పౌరాణికం 'కురుక్షేత్రం'

ద‌ర్శ‌న్ మాట్లాడుతూ… “ఈ సినిమా గురించి చెప్పాలంటే 70ల కాలం నుంచి 2019 వ‌ర‌కు ఉన్న పెద్ద పెద్ద యాక్ట‌ర్స్ అంద‌రూ ఈ చిత్రంలో న‌టించారు. మునిర‌త్నగారికి ధన్యవాదాలు. ఈ రోజుల్లో ఇలాంటి చిత్రాలు ఎవ‌రు చేస్తున్నారు? కాని ఆయ‌న చేశారు. మన పౌరాణికాలు ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కి తెలియ‌వు. అర్జునుడు, దుర్యోధ‌నుడు వాళ్లకు తెలియ‌దు. ఈ సినిమాని 3డిలో చూడ‌డం గ‌ర్వంగా ఉంది. నా పిల్ల‌లు కూడా హ‌ల్క్‌, స్పైడ‌ర్‌మెన్ లాంటి పాత్ర‌ల‌కి ఎట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళ‌కి ఈ పాత్ర‌ల‌న్ని మ‌న భార‌త‌దేశం నుండి పుట్టిన‌వే అని తెలియ‌జేయాలి, ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌రికి ఈ పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేస్తుంది” అన్నారు.

వెన్నెల‌కంటి మాట్లాడుతూ… “తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి.. అన్న నానుడి ఉండ‌నే ఉంది. ఈ సినిమాకి హీరో మునిర‌త్న‌గారే. ఇంత మంచి చిత్రానికి నాకు మాట‌లు, పాట‌లు రాసే అవ‌కాశం క‌ల్పించిన‌, నాగ‌న్న‌గారికి ప్రొడ్యూస‌ర్‌గారికి అంద‌రికీ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు” అని అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు రాక్‌లైన్ వెంక‌టేష్ మాట్లాడుతూ.. “ఇలాంటి ఓ గొప్ప చిత్రాన్ని మునిరత్నం గారు నిర్మించ‌టం, నేను స‌మ‌ర్ప‌కుడిగా వుండ‌టం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేయ‌టానికి స‌హ‌క‌రించిన అంద‌రికి నా ద‌న్య‌వాధాలు. ఈ చిత్రంలోఅర్జున్, మా ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్, సొనూసూద్, ర‌విచంద్ర‌న్, స్నేహ.. ఇలా చాలా మంది పెద్ద ఆర్టిస్టులు న‌టించారు. ఈ చిత్రాన్ని ఏక‌ కాలంలో ఐదు భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాం” అని తెలిపారు.

3డిలో తయారైన తొలి పౌరాణికం ‘కురుక్షేత్రం’ | actioncutok.com

More for you: