వరుసగా నాలుగో హిట్ సాధిస్తాడా?


వరుసగా నాలుగో హిట్ సాధిస్తాడా?

వరుసగా నాలుగో హిట్ సాధిస్తాడా?

వరుసగా మూడేళ్లు మూడు హిట్లతో జోరు మీదున్న అడివి శేష్.. ఇప్పుడు నాలుగో హిట్‌పై కన్నేశాడు. అతను హీరోగా నటించిన ‘ఎవరు’ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హీరోగా శేష్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ‘క్షణం’. అది 2016లో వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తయారైన ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 2017లో దానికి పూర్తి విరుద్ధమైన కామెడీ జోనర్‌లో శేష్ చేసిన ‘అమీ తుమీ’ మూవీ జనాన్ని కడుపుబ్బ నవ్వించింది. గత ఏడాది ‘గూఢచారి’ అనే స్పై థ్రిల్లర్ చేసిన అందర్నీ ఆశ్చర్యపరిచాడు శేష్. సూపర్‌స్టార్ కృష్ణ తర్వాత తెలుగు తెరపై గూఢచారిగా మెప్పించిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

ఇలా ఏడాదికో సినిమా చొప్పున వరుసగా మూడేళ్లు మూడు సినిమాలతో హిట్లు సాధించి టాలీవుడ్ జనాల్ని తనవేపు తిప్పుకున్నాడు. అందుకే ఆగస్ట్ 15న వస్తోన్న అతడి సినిమా ‘ఎవరు’పై అందరూ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాతో వెంకట్ రాంజీ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. రెజీనా కసాండ్రా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఎలా ఉండబోతోందో కొద్ది రోజుల క్రితం రిలీజైన ట్రైలర్ రుచి చూపించింది. చూసింది తెలుగు సినిమా ట్రైలరా? హాలీవుడ్ సినిమా ట్రైలరా? అనే సందేహాన్ని కలిగించింది. గ్రిప్పింగ్ అండ్ ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో ‘ఎవరు’ ప్రేక్షకుల్ని క్షణం క్షణం ఉత్కంఠకు గురిచేస్తుందని శేష్ చెబుతున్నాడు.

తక్కువ బడ్జెట్‌తోటే మంచి క్వాలిటీతో సినిమాని ప్రెజెంట్ చేసే యాక్టర్‌గా పేరు పొందిన శేష్ ‘ఎవరు’తో వరుసగా నాలుగో ఏడాది నాలుగో హిట్‌ను సాధిస్తాడా? చూద్దాం.

వరుసగా నాలుగో హిట్ సాధిస్తాడా? | actioncutok.com

More for you: