Gang Leader Trailer Reactions: 5 Ups And 1 Down


Gang Leader Trailer Reactions: 5 Ups And 1 Down

Gang Leader Trailer Reactions: 5 Ups And 1 Down

నాని హీరోగా నటించిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ట్రైలర్ యూట్యూబ్‌లో రిలీజైంది. రైటర్‌గా తనేమిటో నిరూపించుకోవాలనుకొనే పెన్సిల్ అనే యువకుడి కథ ఈ సినిమా. విలన్‌గా ‘ఆర్ ఎక్స్ 100’, ‘గుణ 369’ సినిమాల హీరో కార్తికేయ నటించాడు. నాని గ్యాంగ్ మెంబర్స్‌గా సీనియర్ యాక్టర్స్ లక్ష్మి, శరణ్య, నూతన నటి ప్రియాంక అరుళ్‌మోహన్‌తో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తారు. విక్రం కె. కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బేనర్ నిర్మించింది.

2.30 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్.. పెన్సిల్ కేరెక్టర్ ఎలా ఉంటుందనే విషయంతో పాటు, హాలీవుడ్ సినిమాల్ని చూస్తూ వాటి స్టోరీల్ని ఉన్నదున్నట్లు రాసి, వాటికి తెలుగు పేర్లు పెడుతుంటాడనే విషయాన్నీ తెలియజేసింది. తన గ్యాంగ్‌తో పెన్సిల్ పార్థసారథి  చేసే అడ్వెంచర్స్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తాయనేది స్పష్టం. ట్రైలర్ ఆరంభంలోనే పెన్సిల్ ఒక హాలీవుడ్ మూవీ చూస్తూ, అందులో లీనమైపోతూ, ఆ సన్నివేశాలకు కదిలిపోతూ “ఇట్లా.. ఇట్లా.. రాయాలి. కాదు.. ఇదే రాయాలి” అంటూ ల్యాప్‌టాప్‌లో ఆ కథను కంపోజ్ చేస్తూ కనిపిస్తాడు. అంటే అతడొక కాపీ రైటర్ అన్నమాట!

Gang Leader Trailer Reactions: 5 Ups And 1 Down

పెన్సిల్ ఇంటికి ఐదుగురు గ్యాంగ్ మెంబర్స్ మొదటిసారి వస్తారు. “28 రివెంజ్ కథలు రాశాడంటే అతని ఆలోచనల్లో ఎంత పగవుంటుంది” అంటుంది, ఆ గ్యాంగ్‌లో అందరికంటే పెద్దదైన బామ్మ. అప్పుడు పెన్సిల అక్కడుండడు. దుమ్ము పట్టిన ఒక వైట్ క్లాత్ తీస్తే, దానికింద పెన్సిల్ రాసిన బుక్స్ కనిపిస్తాయి. అందులో ఒక పుస్తకం పేరు ‘రసీదుని చంపు’.

ఆ పుస్తకం చూసి, “చాలా మంచి పుస్తకమే ఇది. నేనీ బుక్ పూర్తిగా చదివా కానీ, ఈ రసీదెవరో తెలీదు” అంటుంది బామ్మ ఆసక్తిగా. తన మాటలు బయటివాళ్లకు వినపడకూడదన్నట్లు ప్రియాంక చిన్నగా మాట్లాడుతూ “బామ్మా.. రసీదు అంటే బిల్. ‘కిల్ బిల్’ అనే మూవీ అది. పెద్ద ఫ్రాడ్ వీడు” అని చెప్తుంది. అదీ విషయం. ‘కిల్ బిల్’ అనే సూపర్ హిట్ హాలీవుడ్ మూవీని మనవాడు ‘రసీదుని చంపు’ అనే పేరుతో ట్రూ ట్రాన్స్‌లేట్ చేశాడన్న మాట.

ఆ తర్వాత గ్యాంగ్ మెంబర్స్‌తో పెన్సిల్ మీటింగ్ పెడతాడు. హాల్లో చుట్టూ ఉన్న బుక్ షెల్ఫ్‌లను చూపిస్తూ “మా రైటర్స్ ప్రపంచం అంటే ఇంతే. పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది. ఆకలేస్తే అక్షరాలు తింటాం. చలేస్తే పుస్తకాలు కప్పుకుంటాం” అంటాడు చాలా క్యాజువల్‌గా.

నెక్స్ట్ సీన్‌లో ప్రియదర్శితో పెన్సిల్ మీటింగ్. టేబుల్‌పై స్పైరల్ బైండ్ చేసిన ఒక స్క్రిప్ట్ కూడా పెట్టివుంటుంది. బహుశా అది పెన్సిల్ రాసిన స్టోరీ అయ్యుంటుంది. పెన్సిల్ చెప్పిన కథ విని ప్రియదర్శి “ఒక రివెంజు.. ఒక ఫేమస్ రైటర్ వాళ్లకు హెల్ప్ జేస్తాడు.. అనేదే కథ” అంటాడు ఎగ్జైట్ అయిపోతూ.

Gang Leader Trailer Reactions: 5 Ups And 1 Down

ఆ తర్వాత గ్యాంగ్ అంతా వాన పడుతుంటే గొడుగులేసుకొని ఎక్కడికో వెళ్తున్నట్లు కనిపిస్తారు. కట్ చేస్తే.. పెన్సిల్ ఇల్లు.. ఎదురుగా బోర్డుపై పేపర్ కటింగ్స్. వాటిపై పెన్నుతో గీతలు.. ఆ బోర్డు వంక దీక్షగా చూస్తూ “ఆ పుస్తకాల్లోని హీరోలెప్పుడూ కూడా ఇలాంటి పెద్ద బోర్డు కొని, దానిమీద కేసుకు సంబంధించిన పేపర్ కంటింగ్లు అన్నీ అంటించి, రెండే రెండు నిమిషాలు ఆలోచిస్తే చాలు క్లూ దొరికేస్తుంది.. రెండు రోజుల్నుంచి ఆలోచిస్తున్నాను. క్లూ కాదు కదా తలనొప్పొచ్చేస్తోంది” అంటాడు పెన్సిల్, తలపట్టుకొని ఆయాసపడ్తూ. దాన్ని బట్టి మనవాడు టేకప్ చేసిన ఒక కేసుకు సంబంధించి ఎంత ట్రై చేసినా క్లూ దొరకలేదని తెలుస్తోంది.

హీరోయిన్ “అసలు ప్లానేంటి?” అని అడిగితే, “ప్రపంచంలో ఎంతటి మగాడ్నయినా మాయ చేయగలిగే ఒకే ఒక్క పవర్‌ఫుల్ వెపన్ అమ్మాయి” అని చెప్తాడు పెన్సిల్. దానికి బామ్మ “నేను వెళ్తాను.. నేను వెళ్తాను” అని ఉత్సాహపడుతుంటే.. ఆమె వంక అయోమయంగా చూస్తాడు పెన్సిల్.

“ఫస్ట్ టైం నీ లైఫ్‌లో ఒక రిజినల్ స్టోరీరా” అని ప్రియదర్శి అనడాన్ని బట్టి, పెన్సిల్ కాపీ రైటర్ అనే విషయం అతడికి తెలిసిపోయిందని అర్థమవుతుంది. దాంతో పాటు తనకెదురైన రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌తో పెన్సిల్ చెప్పిన కథ అతడిని ఇంప్రెస్ చేసిందని కూడా తెలుస్తోంది.

Gang Leader Trailer Reactions: 5 Ups And 1 Down

ల్యాప్‌టాప్‌లో తను కొట్టిన స్టోరీ చూపిస్తూ “యాజిటీజ్‌గా ఇదే జరిగింది తెలుసా?” అని పెన్సిల్ అంటే, దానికి శరణ్య “అవునవును.. నువ్వు టైప్ చేసినట్లే జరుగుతోంది” అంటుంది సీరియస్‌గా. వెంటనే మనోడు ఒక బటన్ ప్రెస్ చేస్తాడు. “మనం వెతుకుతున్న ఆరోవాడు” అని అతడు చెప్పగానే, ఒక ఖరీదైన బ్లాక్ కారు, దాని పక్కనే సూటుబూటు వేసుకొని కార్తికేయ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతారు.

“ఐదుగురు ఆడవాళ్లు.. వాళ్లతో ఒకడు” అని కార్తికేయ కోపంతో ఊగిపోవడాన్ని బట్టి పెన్సిల్ గ్యాంగ్‌తో అతడికేదో పెద్ద చిక్కు వచ్చిందన్న మాట. దాంతో అతడు వాళ్లపై కక్షకట్టాడు. పెన్సిల్ ఇంటికి కార్తికేయో, అతడి మనిషో వచ్చాడు. రివాల్వర్‌తో శరణ్యను షూట్ చేశాడు. ఆమెకేమైందో ట్రైలర్‌లో చూపించలేదు.

కట్ చేస్తే.. బైనాక్యులర్స్‌తో గ్యాంగ్ మెంబర్స్ పరుగులు పెడుతున్నారు. పరిగెత్తలేకపోతున్న బామ్మని చేతుల్లో మోసుకుంటూ పెన్సిల్ పరిగెత్తాడు. గ్యాంగ్‌తో “యుద్ధానికి సిద్ధం కండి. సమరశంఖం నేనూత్తాను” అన్నాడు. అలా రివెంజర్స్ అసెంబుల్ అయ్యారు. ఆ తర్వాత ఒక క్రైంకు సంబంధించిన విజువల్స్ చూపించారు. బహుశా ఏ బ్యాంకుకో కన్నం వేసి డబ్బులు దోచుకుపోయినట్లున్నారు ముసుగుదొంగలు.

Gang Leader Trailer Reactions: 5 Ups And 1 Down

పెన్సిల్, కార్తికేయ మధ్య ఫైట్ వచ్చింది. “రేయ్.. నేనింకా థ్రిల్లర్ జోనర్‌లోనే ఉన్నాను. సైకో కిల్లర్ జోనర్‌లోకి వెళ్లేలోగా మొదలెట్టేద్దాం” అని కార్తికేయపై పంచ్ విసిరాడు పెన్సిల్. ఇద్దరూ అక్కడి ఆటోమొబైల్ షాపులోని రాడ్లు, రెంచిలు పట్టుకొని కొట్టుకోడానికి గాల్లోకి లేచారు. ఇద్దర్లో ఎవరు గెలుస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా!

ఇవీ ట్రైలర్ మనకు చెబుతున్న విషయాలు. ఇందులో చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’కు ట్రిబ్యూట్‌గా ఒక సీన్ కూడా ఉంది. ఆ మూవీలో వెల్డింగ్ చేస్తూ చిరంజీవి కనిపిస్తాడు గుర్తింది కదా. అదే తరహాలో ఈ సినిమాలో నాని కూడా వెల్డింగ్ చేస్తాడు.

మొత్తంగా చూస్తే.. స్టోరీలు రాసి పేరు తెచ్చుకోవాలనుకొనే పెన్సిల్ అనే పెన్ నేం పెట్టుకున్న ఒక యువకుడు కాపీ కథలు రాస్తుంటాడనీ, అలా కాకుండా ఒరిజినల్ స్టోరీ కావాలని ప్రియదర్శి అడిగితే, రియల్ లైఫ్‌లో చూసిన ఒక ఇన్సిడెంట్‌ను బేస్ చేసుకొని, ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి, అందులో భాగంగా ఐదుగురు ఆడవాళ్లను గ్యాంగ్‌గా ఏర్పాటు చేసుకొని, ఆ గ్యాంగ్‌తో ఒక మిస్టరీని ఛేదించాడనీ ఊహించవచ్చు. ఈ కథను ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ విక్రం కుమార్ రూపొందించాడు. సెప్టెంబర్ 13న వస్తున్న ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ మనల్ని ఎంతగా వినోదింపజేస్తుందో చూడాలి మరి.

Here is the trailer for you:

Gang Leader Trailer Reactions: 5 Ups And 1 Down | actioncutok.com

More for you: