Kajal Aggarwal Interview


Kajal Aggarwal Interview

Kajal Aggarwal Interview

‘రణరంగం’ నా సినిమా కాదు. ఈ ఫిలింలో నేనో కేరెక్టర్ చేశానంతే.. అంటున్నారు కాజల్ అగర్వాల్. పన్నెండేళ్లుగా ప్రేక్షకుల్ని తన నటనతో, గ్లామర్‌తో అలరిస్తూ వస్తోన్న ఆమె ఆగస్ట్ 15న ‘రణరంగం’ మూవీతో మరోసారి ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆ సినిమా గురించీ, ఇతర విషయాల గురించీ కాజల్ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే…

ఇప్పుడు నేను ఏ స్థానంలో ఉన్నాను, దాన్ని ఎలా నిలుపుకోవాలి.. అని ఆలోచించను. మన పని మనం సిన్సియర్‌గా చేసుకుపోవాలి. అంతే. అనవసరమైన స్ట్రెస్ ఎందుకు? మన లైఫ్‌లో ఎంతో స్ట్రెస్ ఉంటుంది. దానికి అదనంగా ఈ స్ట్రెస్ ఎందుకు?

ఐ లవ్ డ్రామా

‘రణరంగం’లో నేను డాక్టర్‌గా కనిపిస్తాను. సెకండ్ హాఫ్‌లో వస్తాను. మంచి కేరెక్టర్. చాలా చక్కని స్టోరీ. ఎంటర్‌టైనింగ్‌గా, గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఐ లవ్ డ్రామా. అందుకే ఈ సినిమాలో భాగం కావాలనుకున్నా. కచ్చితంగా నా కేరెక్టర్‌తో కథ ముందుకు నడుస్తుందని చెప్పగలను. ఇదివరకు ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో డాక్టర్‌గా చేశాను. ఇది ఫాబ్యులస్ యూనిట్. డైరెక్టర్ సుధీర్‌వర్మ చాలా టాలెంటెడ్. అతని ఐడియాస్ అమేజింగ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

ఫ్లాష్‌బ్యాక్‌ కేరెక్టర్ కాదు

నాది ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే కేరెక్టర్ కాదు. 2019 అమ్మాయిని. నడివయసులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌కు లవ్ ఇంటరెస్ట్ తరహా కేరెక్టర్ చేశాను. ఆ గ్యాంగ్‌స్టర్ చాలా జెన్యూన్ పర్సన్. అతని జర్నీలో ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది. ఒక సమయంలో ఆ కేరెక్టర్‌కు నా కేరెక్టర్ అవసరం పడుతుంది. ఆ తర్వాత జరిగే ఘటనలతో స్టోరీ ముందుకు నడుస్తుంది. ఆ ఇద్దరూ ఎందుకు కలుస్తారు? అనేది సినిమాలో చూడాలి. శర్వానంద్‌తో నాకు మరీ ఎక్కువ సన్నివేశాలు లేవు. సెట్స్‌పై మేం తక్కువ సమయమే కలిసి పనిచేశాం. అతనితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. డిమాండింగ్ కేరెక్టర్స్ నుంచి సింపుల్ కేరెక్టర్స్ వరకు చేసుకుంటూ వెళ్తున్నా. ‘రణరంగం’లో నాది డిమాండింగ్ కేరెక్టర్ కాదు. చాలా సింపుల్ కేరెక్టర్. అదే ‘సీత’లో అయితే నాది చాలా డిమాండింగ్, స్ట్రెన్యువస్ కేరెక్టర్. ప్రస్తుతం అలాంటి స్ట్రెన్యువస్ కేరెక్టర్‌ను ‘కాల్ సెంటర్’లో చేస్తున్నా. అది తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తయారవుతోంది.

ఒకే రోజు రెండు సినిమాలు

ఆగస్ట్ 15న నావి రెండు సినిమాలు రిలీజవుతుతున్నాయి. తెలుగులో ‘రణరంగం’, తమిళంలో జయం రవితో చేసిన ‘కోమలి’. ఇదివరకు కూడా ఇలాగే తమిళంలో ఒకే రోజు ‘మాట్రన్’, ‘తుపాకి’ వచ్చాయి. ఏమైనా ఒకే రోజు నావి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం బెస్ట్ ఫీలింగ్. రెండు సినిమాలూ బాగా ఆడాలని కోరుకుంటున్నా.

‘సీత’ చేసినందుకు నో రిగ్రెట్స్

‘సీత’ మూవీకి చాలా కష్టపడ్డాను. ఫలితం నా చేతుల్లో లేదు కదా. ఇది దేవుడి తప్పని నేను చెప్పను. నా సినిమా కాబట్టి దాని బాధ్యత నాదే. అయితే అందులో నాది బ్రిలియంట్ కేరెక్టర్. నా నటనకు అందరి నుంచీ మంచి రిపోర్ట్ వచ్చింది. సినిమా హిట్టయితే అది టీం వర్క్ వల్లే సాధ్యం. నేను ‘సీత’కు డైరెక్టర్‌నో, ప్రొడ్యూసర్‌నో కాదు. లైట్‌బాయ్ నుంచి మొదలుకొని అందరూ కలిసి పనిచేస్తేనే ఒక సినిమా తయారవుతుంది. ఎక్కడో తప్పు జరుగుతుంది. దాంతో సినిమా ఫెయిలవుతుంది. అది ఒక వ్యక్తి చేతుల్లో ఉండదు. ఆ సినిమా చేసినందుకు నేను ఫీలవడం లేదు. ఇప్పటివరకూ నేను చేసిన మంచి కేరెక్టర్స్‌లో అదొకటని నమ్ముతున్నా. అది చేసినందుకు గర్విస్తున్నా. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. తేజ డైరెక్షన్‌లో ఇప్పటికి మూడు సినిమాలు చేశాను. ఆయనతో పనిచెయ్యడం చాలా డిఫికల్ట్. అయినా సవాళ్లను నేను ఇష్టపడతాను. ఆయనతో మళ్లీ కలిసి పనిచేయడానికి వెనుకాడను.

‘ఇండియన్ 2’ ఛాన్స్ రావడం లక్కీ

నవంబర్ నుంచి ‘ఇండియన్ 2’కి వర్క్ చేయబోతున్నా. అందులో నాది ఫ్యాబ్యులస్ కేరెక్టర్. దాన్ని పోషించడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. అది వెరీ పవర్‌ఫుల్ రోల్. నన్ను నమ్మండి. అది అమేజింగ్ మూవీ. అందులో అవకాశం పొందడాన్ని లక్కీగా భావిస్తున్నా. ఆ కేరెక్టర్ కోసం ఫిజికల్‌గా కూడా కష్టపడుతున్నా. నా బాడీని బిల్డ్ చేసుకుంటున్నా. అంతకుమించి ఆ సినిమా గురించీ, నా పాత్ర గురించీ ఏమీ చెప్పలేను.

నేను నిర్మాతను కాను

ప్రస్తుతం నేనే సినిమానీ ప్రొడ్యూస్ చెయ్యడం లేదు. నిర్మాతగా చెయ్యడానికి నేనింకా సిద్ధం కాలేదు. ఒక సినిమాని ప్రొడ్యూస్ చెయ్యాలంటే నేనింకా నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది. ప్రస్తుతం నేను నటన మీదే దృష్టి పెడుతున్నా. ఏదైనా ఆసక్తికరమైన సబ్జెక్ట్ నా దగ్గరకు వస్తే అప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తాను. ‘అ!’ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మతో మరోసారి కలిసి పనిచేయడానికి చర్చలు నడుస్తున్నాయి. అది చెయ్యాలనుకుంటున్నా. ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. దానికి నేను నిర్మాతను కాను. నవంబర్ దాకా నా డేట్స్ ఖాళీగా లేవు. నవంబర్ ఆఖరుకు అది మొదలుకావచ్చు. అది ఫాబ్యులస్ స్టోరీ. వెరీ డిమాండింగ్ అండ్ చాలెంజింగ్ కేరెక్టర్.

Kajal Aggarwal Interview | actioncutok.com

More for you: