‘సాహో’ ట్రైలర్ రివ్యూ


'సాహో' ట్రైలర్ రివ్యూ

‘సాహో’ ట్రైలర్ రివ్యూ

భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘సాహో’ ట్రైలర్ హాలీవుడ్ యాక్షన్ సీన్స్‌ను తలపిస్తోంది. ఇందులో ప్రభాస్ చాలా స్టయిలిష్‌గా కనిపిస్తున్నాడు. ముంబైలో జరిగిన రూ. 2 వేల కోట్ల దొంగతనం కేసును ఛేదించే అండర్ కవర్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ పేరు అశోక చక్రవర్తి అని తెలుస్తోంది. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అమృతా నాయర్ పాత్రలో శ్రద్ధా కపూర్ నటిస్తోంది.

Here is the trailer for you:

ప్రభాస్-శ్రద్ధ మధ్య రొమాన్స్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హీరోహీరోయిన్ మధ్య వచ్చే రొమాన్స్ సీన్స్ రిచ్‌ లుక్‌లో ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్లను అంతమొందించే అండర్ కవర్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ చేసే యాక్షన్ సన్నివేశాలు ‘సాహో’ సినిమాకు కీలకం అని చెప్పొచ్చు. ‘గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది.’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైలర్‌లో ఆకట్టుకుంటోంది. అండర్ వాటర్ ఫైట్స్ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు కనిపిస్తోంది.

ఇక వెన్నెల కిశోర్-ప్రభాస్ మధ్య కామెడీ సీన్స్ ఉన్నట్లు ట్రైలర్‌లో చూపించారు. అలాగే హీరో హీరోయిన్ మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నట్లు చూపించారు. అండర్ కవర్ ఆఫీసర్ అయిన ప్రభాస్‌‌కు హీరోయిన్ గన్ ఎక్కుపెట్టడం.. ట్రైలర్ చివర్లో హీరో చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం సస్పెన్స్‌ క్రియేట్ చేస్తోంది. మొత్తంగా ‘సాహో’ ఇండియన్ మూవీని హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లే యాక్షన్ ప్యాక్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ‘సాహో’ ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

‘సాహో’ ట్రైలర్ రివ్యూ | actioncutok.com

More for you: