Saaho Movie Review: 3 Ups And 5 Downs


Saaho Movie Review: 3 Ups And 5 Downs

Saaho Movie Review: 3 Ups And 5 Downs

తారాగణం: ప్రభాస్, శ్రద్ధా కపూర్, చంకీ పాండే, నీల్ నితిన్ ముఖేశ్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, వెన్నెల కిశోర్, లాల్, మందిరా బేడి

దర్శకుడు: సుజీత్

విడుదల తేదీ: 30 ఆగస్ట్ 2019

‘సాహో’గా ప్రభాస్ వచ్చేశాడు. మరి అందరి అంచనాలకు తగ్గట్లుగా, అందరి ఊహలకు తగ్గట్లుగా ‘సాహో’ అలరించాడా.. అనేది చూద్దాం. ఈ సినిమాని కథ కోసం చూడకండి, స్క్రీన్‌ప్లే కోసం చూడండి.. అని రిలీజ్‌కు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ప్రభాస్ స్వయంగా చెప్పాడు. కథ లేకపోయినా స్క్రీన్‌ప్లేతో నెట్టుకొచ్చిన సినిమాలున్నాయి. కానీ సినిమాకి ఎంతో కొంత కంటెంట్ అనేది చాలా ముఖ్యం.

ఏ సినిమాకైనా స్టోరీటెల్లింగ్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. మరి ‘సాహో’ స్టోరీటెల్లింగ్ విషయంలో డైరెక్టర్ పాసయ్యాడా?.. అంటే, లేదనే చెప్పాలి. కంటెంట్, స్టోరీటెల్లింగ్ సినిమాకు కీలకమనే విషయాన్ని విస్మరించి, యాక్షన్ ఎపిసోడ్స్ మీదనే అతను ఎక్కువ దృష్టి పెట్టినట్లు మనకు అనిపిస్తుంది. ప్రి-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో అతను డిజైన్ చేసిన, స్టంట్ డైరెక్టర్లతో చేయించిన యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తే, వాటిని ఆధారం చేసుకొని, సుజిత్ కథ అల్లాడేమో అనే సందేహం మనకు వస్తుంది.

‘అజ్ఞాతవాసి’ సినిమా ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘లార్గో వించ్’ ఆధారంగా తీశారని మనలో చాలామందికి తెలుసు. ‘సాహో’ చూస్తే, ఇందులోనూ ‘లార్గో వించ్’ ఛాయలు కనిపిస్తాయి. సాహో కేరెక్టర్‌లో వచ్చే ట్విస్ట్స్ సరిగ్గా అలాగే ఉంటాయి. సాహో కేరెక్టర్‌కు సంబంధించి ఇంటర్వెల్‌లో ఒక ట్విస్టూ, క్లైమాక్స్‌లో ఒక ట్విస్టూ వస్తాయి. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ థ్రిల్ కలిగిస్తుంది. అయితే అది సరిపోదు.

Saaho Movie Review: 3 Ups And 5 Downs

‘సాహో’ కథ ఒక మాఫియా సామ్రాజ్యానికి చెందిన ఒక సింహాసనం కోసం జరిగే యుద్ధం. ఆ కుర్చీ కోసం రెండు వర్గాలు కొట్లాడినప్పుడు, ఏ వర్గానికి ఆ కుర్చీ దక్కుతుందనే పాయింట్‌పై ఈ సినిమా కథ అల్లాడు సుజిత్. కథ మొదట్లో అశోక్ చక్రవర్తి అనే అండర్‌కవర్ కాప్ రోల్‌లో ప్రభాస్ మనకు కనిపిస్తాడు. రూ. 2 వేల కోట్ల రాబరీ వెనుక ఉన్నవాళ్లను పట్టుకోవడం అతని మిషన్. అయితే ఇలాంటి యాక్షన్ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ చాలా భారీగా ఉంటుందనుకొనే వాళ్లు మాత్రం కాస్త నిరుత్సాహానికి గురవుతారు. అయినప్పటికీ ‘సాహో’ కేరెక్టర్‌లో ప్రభాస్ చెలరేగిపోయాడు. చాలా సునాయాసంగా ఆ పాత్రను పోషించాడు.

యాక్షన్ సీన్స్‌లో ప్రభాస్ స్పీడ్, ఎనర్జీ లెవల్స్ చూసి మనం ఆశ్చర్యపోతాం. ఆ సీన్స్‌లో అతను బాగా రాణించాడు. అవి ప్రేక్షకుల్ని బాగా అలరిస్తాయి. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోవడమే. అది తప్పితే కథలో ఎమోషనల్ కోషియెంట్ మిస్సయి ఫస్టాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేంత వరకు బోర్ ఫీలవుతాం. చిన్న చిన్న చమక్కులు తప్పితే చెప్పుకోడానికి ఏమీ ఉండదు. ఎంతకూ కథ నడవడం లేదేమిటా అని విసుగు చెందుతాం.

ఈ సినిమాకి ఎంతో కొంత గ్లామర్ తీసుకు వచ్చింది హీరోయిన్ శ్రద్ధా కపూర్. అమృతా నాయర్ అనే పోలీస్ ఆఫీసర్ రోల్‌కి పర్ఫెక్టుగా సూటయింది. అయితే ఆమె గ్లామర్‌ని డైరెక్టర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. హీరోతో ఆమెకు రొమాంటిక్ యాంగిల్ మిస్సయింది. వాళ్లిద్దరి మధ్యా సీన్లలో మనం ఎక్స్‌పెక్ట్ చేసే రొమాన్స్ లేకపోవడంతో డిజప్పాయింట్ అవుతాం. ఇది సినిమాకి మైనస్ పాయింట్. ఇక వెన్నెల కిశోర్ ఉన్నాడంటే నవ్వులే నవ్వులని అనుకుంటాం. ఇక్కడా మనల్ని దెబ్బ కొట్టాడు డైరెక్టర్.

Saaho Movie Review: 3 Ups And 5 Downs

మళ్లీ ఒకసారి కథ విషయానికి వస్తే, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను మనం ముందుగానే ఊహించగలం. మాఫియా సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరాటం ప్రి క్లైమాక్స్ వచ్చేంత వరకు విసుగు తెప్పించే వ్యవహారంగానే ఉంటుంది. సాహో కేరెక్టర్‌కు సంబంధించిన కీలక అంశం బయటకు వచ్చే ప్రి-క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ రోమాలు నిక్కబొడుచుకునేలా చిత్రీకరించడంలో సుజిత్ సక్సెసయ్యాడు. ఆ ఎపిసోడ్ విషయంలో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్లు తాము చేయాల్సిందంతా చేశారు. ఎన్నో వాహనాల్ని ఆ ఎపిసోడ్ కోసం ధ్వంసం చేశారు. ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ. 70 లక్షలు ఖర్చుపెట్టామని సుజిత్ స్వయంగా చెప్పాడు.

మనం చూస్తోంది తెలుగు సినిమా యాక్షన్ సీన్లేనా లేక, ఏ హాలీవుడ్ యాక్షన్ సినిమానా.. అనే సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాం. యాక్షన్ ప్రియులకు ఈ ఎపిసోడ్ పండగ లాంటిది. దాంతో సినిమా సక్సెస్ అవుతుందా.. అంటే, సందేహమే. అదీ, క్లైమాక్స్‌లో భారీ దృఢకాయులతో ప్రభాస్ చేసే ఫైట్ మినహాయిస్తే, సినిమాలో చెప్పుకోడానికి ఏముందీ అని ఆలోచిస్తే, అసంతృప్తికి గురవుతాం.

విజువల్‌గా సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్ వర్క్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన శ్రీకరప్రసాద్ ఈ సినిమాకి ఎడిటర్. తనకిచ్చిన మెటీరియల్‌ని సాధ్యమైంతవరకు మెరుచుపర్చడానికి ఆయన ప్రయత్నించాడు కానీ, ఆ సరుకులో ‘విషయం’ ఉండాలిగా! సినిమాలోని మరో పెద్ద మైనస్.. సాంగ్స్. ఏ ఒక్క పాటా క్యాచీగా, పాడుకోడానికి వీలుగా లేదు. చూడ్డానికి మాత్రం రెండు పాటలు బాగున్నాయి.

Saaho Movie Review: 3 Ups And 5 Downs

ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, ప్రభాస్, శ్రద్ధా కపూర్ తర్వాత ముగ్గురి గురించి చెప్పుకోవాలి. మెయిన్ విలన్‌గా చేసిన చంకీ పాండే, సాహోకు సహాయకారిగా నటించిన మురళీశర్మ (నిజానికి ఈ కేరెక్టర్‌ను వెన్నెల కిశోర్‌కు ఇవ్వాల్సింది), దొంగగా పరిచయమై పోలీసాఫీసర్ అని తేలే కేరెక్టర్‌లో నీల్ నితిన్ ముఖేశ్. గ్యాంగ్‌స్టర్‌గా తనకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో అతను చెప్పుకోదగ్గ కేరెక్టర్లేమీ చెయ్యలేదు. ఇప్పుడు ‘సాహో’ సినిమా రూపంలో అతనికి మంచి అవకాశం దక్కింది.

కొంచెం హ్యూమర్ టచ్ ఉండే కేరెక్టర్‌ని మురళీశర్మ తనదైన శైలిలో సునాయాసంగా చేసుకుపోయాడు. నీల్ నితిన్ చక్కగా తన పాత్రలో ఒదిగిపోయాడు. మిగతా పాత్రలేవీ సరిగా ఎలివేట్ కాలేదు. వెన్నెల కిశోర్, లాల్, అరుణ్ విజయ్, మందిరా బేడి, మహేశ్ మంజ్రేకర్, టినూ ఆనంద్ వంటి నటులను సరిగా వినియోగించుకోలేకపోయారు. వాళ్లు చేసిన పాత్రల్ని సరిగా చిత్రించలేకపోయాడు దర్శకుడు.

మొత్తంగా చూస్తే.. ‘సాహో’ అనేది ప్రభాస్ ఒన్ మ్యాన్ షో!

Saaho Movie Review: 3 Ups And 5 Downs | actioncutok.com

More for you: