‘మహర్షి’ తర్వాతే ‘సాహో’!


2019లో మొదటి వారం సింగిల్ లాంగ్వేజ్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచే అవకాశాన్ని ‘సాహో’ మిస్సయ్యింది. ఇప్పటివరకు ఈ ఏడాది తొలి వారానికి సంబంధించి మహేశ్ మూవీ ‘మహర్షి’దే టాప్ ప్లేస్. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఆ సినిమా తొలి వారం ప్రపంచవ్యాప్తంగా రూ. 171 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ‘సాహో’ తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్‌గా రూ. 143.50 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక మూడో స్థానంలో సంక్రాంతి సినిమా ‘ఎఫ్ 2’ నిలిచింది. ఆ సినిమా తొలి వారం రూ. 142 కోట్లను రాబట్టడం గమనార్హం. అంటే ‘ఎఫ్ 2’ కంటే కేవలం రూ. 1.50 కోట్లు అధికంగా ‘సాహో’ వసూలు చేసింది. అక్టోబర్ 2న వచ్చే చిరంజీవి సినిమా ‘సైరా.. నరసింహారెడ్డి’ ఈ గణాంకాలను మార్చే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి.

దక్షిణ భారత దేశం విషయానికి వస్తే గ్రాస్ కలెక్షన్ల పరంగా తొలి రెండు స్థానాల్ని తమిళ సినిమాలు కైవసం చేసుకున్నాయి. రజనీకాంత్ ‘పేట’ తమిళ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా తొలి వారం రూ. 196 కోట్లను ఆర్జించగా, అజిత్ మూవీ ‘విశ్వాసం’ రూ. 180 కోట్లను రాబట్టింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మన తెలుగు సినిమాలు.. ‘మహర్షి’, ‘సాహో’, ‘ఎఫ్ 2’ నిలిచాయి.