2.0 Vs Baahubali 2: The Latter Remains At The Top


Rajanikanth and Amy Jackson in 2.0

‘బాహుబలి 2’ రికార్డు పదిలం

భారతీయ చిత్రసీమలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన సినిమాగా పేరుపొందిన రజనీకాంత్ ‘2.0’ బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. అయితే విడుదలైన తొలి రోజు నవంబర్ 29న భారతదేశ వ్యాప్తంగా చూసినా, ప్రపంచవ్యాప్తంగా చూసినా రాజమౌళి ‘బాహుబలి 2’ వసూళ్లను అది దాటలేకపోయిందని ట్రేడ్ పండితులు స్పష్టం చేస్తున్నారు. ‘2.0’ బడ్జెట్ ఎంతనే దానిపై భిన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒకరు రూ. 400 కోట్లు అంటే, రమేష్ బాల వంటి ట్రేడ్ విశ్లేషకుడు రూ. 500 కోట్ల పైనే అంటున్నారు. జాతీయ వార్తా పత్రికలు రూ. 600 కోట్లు అని పేర్కొంటున్నాయి. ఏమైనా రూ. 400 కోట్ల పైనే ఖర్చయ్యిందనే విషయం మాత్రం తెలుస్తోంది.

మరోవైపు ‘బాహుబలి 2’కు రూ. 250 కోట్లు ఖర్చయిందని అంచనా. ఆ ప్రకారం చూసుకున్నా ‘బాహుబలి 2’ తొలి రోజు వసూళ్లను ‘2.0’ అధిగమించలేకపోవడం గమనార్హం. ‘బాహుబలి 2’ ఒక్క ఇండియాలోనే తొలిరోజు రూ. 122 కోట్లను ఆర్జించినట్లు రిపోర్టులు తెలియజేస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ‘2.0’ అయితే ప్రపంచవ్యాప్తంగా రూ. 110 కోట్ల వరకు ఆర్జించినట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ వరకు భారత్‌లో 20.25 కోట్లను వసూలు చేసినట్లు బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.

Anushka and Prabhas in Bahubali 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *