Allu Arjun’s Next With Trivikram


Allu Arjun's Next With Trivikram

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడో చిత్రం

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించే 19వ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత యస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి జనవరిలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం కానుంది. ఇదివరకు ఆ ఇద్దరూ కలిసి చేసిన ‘జులాయి’ ఘన విజయం సాధించగా, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఓ మాదిరి విజయం అందుకుంది.

తాజా చిత్రంతో హ్యాట్రిక్ నెలకొల్పాలని వాళ్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఫ్లాపుతో ఉన్నవాళ్లే. త్రివిక్రమ్ మునుపటి సినిమా ‘అజ్ఞాతవాసి’ పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవగా, అల్లు అర్జున్ మునుపటి చిత్రం ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా భారీ నష్టాల్ని చవి చూసింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరూ కలిసి చేయబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.