Karthikeya To Star In New Movie With Protege Of Boyapati


Karthikeya To Star In New Movie With Protege Of Boyapati

బోయపాటి శిష్యుడి దర్శకత్వంలో కార్తికేయ

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో రాత్రికి రాత్రే క్రేజీ స్టార్‌గా మారిన కార్తికేయను వరుస ఆఫర్లు వరిస్తున్నాయి.  అతనితో ఇప్పటికే ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్. థాను తెలుగు, తమిళ భాషల్లో ‘హిప్పీ’ మూవీని నిర్మిస్తుండగా, తాజాగా మరో చిత్రం ప్రకటన వెలువడింది. టాప్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను వద్ద పదేళ్లుగా అసోసియేట్‌గా పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు.

ఇది ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని సమాచారం. టీవీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంస్థలు ఈ చిత్రం ద్వారా సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. అనిల్‌కుమార్, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 27న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుందని వారు తెలిపారు.