Maharshi: Will He Collect Rs.100 Crore Share?


Maharshi poster

‘మహర్షి’ రూ. 100 కోట్ల షేర్ సాధిస్తాడా?

మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘మహర్షి’ సినిమాపై అందరి కళ్లూ నిలుస్తున్నాయి. 2019లో విడుదలవుతున్న సినిమాల్లో ఆకాశమే హద్దుగా అనే రీతిలో అంచనాలున్న సినిమాల్లో ‘మహర్షి’ ఒకటి. పైగా ఇది మహేశ్ 25వ చిత్రం (హీరోగా) కూడా. తొలిసారి డైరెక్టర్ వంశీ పైడిపల్లితో, హీరోయిన్ పూజా హెగ్డేతో మహేశ్ చేసున్న సినిమా. ఇందులో ఆయన రిషి అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇప్పటివరకూ కనిపించని గడ్డం లుక్‌లో మహేశ్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఆ లుక్ ప్రచార మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తూనే ఉంది. మహేశ్ క్యారెక్టర్ భిన్న దశల్లో కనిపిస్తుందనీ, అందులో స్టూడెంట్ కూడా ఒకటనీ డైరెక్టర్ తెలిపాడు. ప్రస్తుతం మహేశ్ వయసు 43 ఏళ్లు. కానీ తెరపై వయసు కనిపించని నటుల్లో ఆయన ముందున్నాడు. అందుకే స్టూడెంట్‌గా ప్రేక్షకులు ఆయనను ఈజీగా యాక్సెప్ట్ చేస్తారనడంలో సందేహం లేదు. ఇప్పుడు ‘మహర్షి’ సినిమా ఎంత వసూలు చేయొచ్చనే దానిపై సినీ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. మునుపటి సినిమా ‘భరత్ అనే నేను’ ఆయన కెరీర్‌లోనే అత్యధికంగా దాదాపు రూ. 95 కోట్ల షేర్ సాధించింది. ‘మహర్షి’ సునాయాసంగా ఆ మార్కును దాటి, రూ. 100 కోట్ల షేర్ సాధించిన చిత్రంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సి. అశ్వినీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో మహా క్రేజ్ సాధించిందని చెబుతున్నారు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా మహేశ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. 2019 ఏప్రిల్ 5న ‘మహర్షి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *