Rakul Preet’s Film Release Date Changed 3rd Time

దే దే ప్యార్ దే: మూడోసారి రిలీజ్ డేట్ మారిన రకుల్‌ప్రీత్ సినిమా
హీరోయిన్గా ప్రస్తుతం ఏ తెలుగు సినిమా చేతిలో లేకపోయినా తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది రకుల్‌ప్రీత్. ప్రస్తుతం ఆమె బాలీవుడి్లో టాప్ హీరోల్లో ఒకరైన అజయ్ దేవగణ్ సరసన ‘దే దే ప్యార్ దే’ సినిమా చేస్తోంది. ఎడిటర్‌గా మంచి పేరున్న అకివ్ అలీ డైరెక్ట్ చేస్తున్న తొలి సినిమా ఇది.
ముచ్చటగా మూడోసారి ఈ సినిమా విడుదల తేదీ మారింది. మొదట 2019 ఫిబ్రవరి 22న సినిమాని విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావనే ఉద్దేశంతో రిలీజ్ డేట్‌ను ఏప్రిల్ 26గా నిర్ణయించారు. కానీ తాజాగా మార్చి 15కి మార్చారు.
దీనికి కారణం ఏప్రిల్ 26న హాలీవుడ్ ఫిల్మ్ ‘అవెంజెర్స్: ఎండ్ గేమ్’ వస్తుండటమే. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా భారత్‌లోనూ భారీ స్థాయిలో విడుదలవనుంది. ఈ నేపథ్యంలో ఓపెనింగ్ కలెక్షన్లపై ఆ సినిమా తప్పకుండా దెబ్బ కొడుతుందనే ఉద్దేశంతో ‘దే దే ప్యార్ దే’ విడుదలను మార్చికి ప్రిపోన్ చేసినట్లు సమాచారం.
రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమాలో టబు, జిమ్మీ షేర్గిల్ కూడా కీలక పాత్రధారులు. రకుల్‌కు హిందీలో ఇది మూడో సినిమా. తొలి సినిమా ‘యారియా’ హిట్టవగా, రెండో సినిమా ‘అయ్యారే’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఇప్పుడు తొలిసారి ఒక అగ్ర హీరోతో చేస్తున్న ‘దే దే ప్యార్ దే’ సినిమా తనకు బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు తీసుకొస్తుందనే నమ్మకంతో ఉంది రకుల్. ఈ సినిమాతో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా, రితీశ్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘మర్జావాన్’లోనూ ఆమె నాయికగా నటిస్తోంది.