Two Heroines Confirmed For Sri Vishnu

శ్రీవిష్ణు సరసన ఇద్దరు నివేదాలు!
శ్రీవిష్ణు హీరోగా ‘బ్రోచేవారెవరురా!’ అనే చిత్రం రూపొందనున్నది. ఇదివరకు అతనితో ‘మెంటల్ మదిలో’ అనే సినిమా తీసి, ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. క్రైమ్ కామెడీ మూవీగా తయారయ్యే ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన ఇద్దరు తారలు హీరోయిన్లు ఎంపికయ్యారు. ఒకరు నివేదా థామస్ కాగా, మరొకరు నివేదా పేతురాజ్.
‘బ్లఫ్ మాస్టర్’ ఫేమ్ సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రధారులు. వివేక్ సాగర్ సంగీతాన్నీ, శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రతిభావంతులైన తారలుగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఇద్దరు నివేదాలతో ‘నీదీ నాదీ ఒకే కథ’తో నటుడిగా విమర్శకులను బాగా ఆకట్టుకున్న శ్రీవిష్ణు కాంబినేషన్ ఆసక్తి రేపుతోంది.
