Vinaya Vidheya Rama: Why Boyapati Choosen Aryan Rajesh?


Vinaya Vidheya Rama: Why Boyapati Choosen Aryan Rajesh?

వినయ విధేయ రామ: ఆర్యన్ రాజేశ్ రోల్ ఏమిటి?

ఆర్యన్ రాజేశ్.. ఈ పేరు వినగానే మనకు ‘లీలమహల్ సెంటర్’, ‘ఎవడి గోల వాడిది’ సినిమాలు జ్ఞాపకమొస్తాయి. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకుగా, అల్లరి నరేశ్ అన్నయ్యగా తెలిసిన రాజేశ్ ‘హాయ్’ (2002) సినిమాతో హీరోగా పరిచయమై తెలుగు, తమిళ భాషల్లో 15 సినిమాల వరకు నటించాడు.

కానీ తర్వాత అవకాశాలు లేక ఐదేళ్ల క్రితం ఆగిపోయాడు. తమ్ముడు నరేశ్ హీరోగా నటించిన ‘బందిపోటు’కు నిర్మాతగా వ్యవహరించాడు. నిజానికి హీరోగా నరేశ్ కంటే రాజేశ్ రాణిస్తాడని ఈవీవీ అనుకున్నారు కానీ, జరిగింది వేరు.

ఏదేమైనా ఐదేళ్ల తర్వాత రాజేశ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా ‘వినయ విధేయ రామ’. రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానున్నది.

ఈ మధ్య విడుదల చేసిన పాట విజువల్స్‌లో ఆర్యన్ రాజేశ్ కనిపించాక, అతడి పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి కలుగుతోంది. అతను చరణ్ అన్నగా కనిపిస్తాడని సమాచారం. అంతే కాదు, అతడి పాత్రకు సంబంధించి కంటతడి పెట్టించే సెంటిమెంట్ సీన్లు ఉన్నాయని తెలుస్తోంది.

ప్రత్యేకంగా ఆ పాత్రను రాజేశ్ చేత బోయపాటి ఎందుకు చేయించాడు? ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ఆకర్షణతో ఆకట్టుకొనే బోయపాటి ఈ సినిమాలోనూ అలాంటి ఆకర్షణీయ అంశాలను జోడించాడు. వాటిలో రాజేశ్ రోల్ కూడా ఒకటి.

అమాయకంగా కనిపించే రాజేశ్ అయితే ఆ కరుణ రసాత్మక పాత్రకు సరిగ్గా సరిపోతాడనే ఉద్దేశంతోనే బోయపాటి అతనితో దాన్ని చేయించాడని భావించాలి. ఆ రోల్‌లో రాజేశ్ ఎలా కనిపిస్తాడనే ప్రశ్నకు నెల రోజుల్లో జవాబు లభించనుంది.