2018 Films That Broke Into IMDb’s Telugu Top 50


2018 Films That Broke Into IMDb's Telugu Top 50
2018 Films That Broke Into IMDb’s Telugu Top 50

ఐఎండీబీ టాప్ 50 తెలుగు సినిమాల్లో చోటు పొందిన 2018 సినిమాలు

ఐఎండీబీ ఇచ్చే రేటింగులు ఒక్కోసారి చాలా వింతగా, విచిత్రంగా అనిపిస్తుంటాయి. తెలుగు చలనచిత్ర చరిత్రలో గొప్ప గొప్ప సినిమాలనుకొనేవి టాప్ 50 లేదా, టాప్ 100లో కనిపించవు. మనం సాధారణ సినిమాలనుకొనేవి టాప్ చార్టుల్లో కనిపిస్తుంటాయి. ఇంతకీ ఆ రేటింగులు ఇచ్చేది వీక్షకులే. దాన్ని బట్టే ఐఎండీబీ టాప్ చార్టులు రూపొందుతాయి. ఇది రాసే సమయానికి 2018లో వచ్చిన నాలుగు సినిమాలు టాప్ 50 సినిమాల్లో చోటు పొందాయి. చిత్రంగా బాక్సాఫీస్ వద్ద ఆడకపోయినా విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమా ముందుంటే, ఆధునిక క్లాసిక్‌గా చెప్పుకోదగ్గ సినిమా దానికంటే వెనుక ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచిన ‘భరత్ అనే నేను’కు కానీ, మీడియం బడ్జెట్ సినిమాగా తయారై కలెక్షన్ల వర్షం కురిపించిన ‘గీత గోవిందం’ కానీ ఈ చార్టులో చోటు పొందకపోవడం చిత్రం.

2018 Films That Broke Into IMDb's Telugu Top 50
2018 Films That Broke Into IMDb’s Telugu Top 50

ఇంతకీ ఓవరాల్ టాప్ 50లో చోటు పొందిన 2018 సినిమాలేవంటే.. ‘మహానటి’, ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘రంగస్థలం’, ‘గూఢచారి’. రేటింగ్ చార్ట్ ప్రకారం ఓవరాల్ టాప్ 10లో చోటు పొందిన ఒకే 2018 చిత్రం ‘మహానటి’. సావిత్రి బయోపిక్‌గా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 5వ స్థానం సంపాదించింది. కీర్తి సురేశ్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాకు 8.1 రేటింగ్ దక్కింది. టాప్ 20లో చూసుకుంటే మరో సినిమానే స్థానం పొందింది. అది.. వెంకటేశ్ మహా రూపొందించగా విమర్శకుల ప్రశంసలను అమితంగా పొందిన ‘కేరాఫ్ కంచరపాలెం’. నాలుగు భిన్న వయసుల జంటల ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా 7.9 రేటింగ్‌తో 18వ స్థానం దక్కించుకుంది.

2018 Films That Broke Into IMDb's Telugu Top 50
2018 Films That Broke Into IMDb’s Telugu Top 50

రాంచరణ్ కథానాయకుడిగా నటించగా సుకుమార్ రూపొందించిన ‘రంగస్థలం’ చిత్రం టాప్ 30లో చోటు దక్కించుకుంది. 2018లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమానే కాకుండా, మోడరన్ క్లాసిక్‌గా నిలిచిన ఈ సినిమాకు 7.8 రేటింగ్‌తో 22వ స్థానం లభించింది. ఇక టాప్ 50లో నిలిచిన మరో సినిమా ‘గూఢచారి’. అడివి శేష్ టైటిల్ రోల్ చేయగా శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేసిన ఈ సినిమా 7.6 రేటింగ్‌తో 42వ ర్యాంక్ సాధించింది.

2018 Films That Broke Into IMDb's Telugu Top 50
2018 Films That Broke Into IMDb’s Telugu Top 50

రత్నాల్లాంటి సినిమాలుగా విమర్శకులు అభివర్ణించిన ‘సమ్మోహనం’, ‘నీదీ నాదీ ఒకే కథ’ కానీ, ప్రేక్షకులు మెచ్చిన ‘భరత్ అనే నేను’, ‘గీత గోవిందం’, ‘భాగమతి’ కానీ, సెన్సేషనల్ హిట్టయిన ‘ఆర్ఎక్స్ 100’ కానీ ఈ టాప్ 50 చార్టులో చోటు దక్కించుకోలేకపోయాయి.