96 Remake: Casting Call For Young Sharwanand!


96 Remake: Casting Call For Young Sharwanand!
96 Remake: Casting Call For Young Sharwanand!

96 రీమేక్: టీనేజ్ శర్వానంద్ కోసం కేస్టింగ్ కాల్

సమంత, శర్వానంద్ ప్రధాన పాత్రధారులుగా దిల్ రాజు ఒక సినిమాని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి నటించగా ఘన విజయం సాధించిన ’96’కు ఇది రీమేక్. తమిళ ఒరిజినల్ డైరెక్టర్ ప్రేంకుమార్ తెలుగు సినిమానీ రూపొందించనున్నాడు. కాగా ఇందులో శర్వానంద్ స్కూలు/కాలేజీ రోజులు చదివేప్పటి కేరెక్టర్ చేయడం కోసం శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థ 14 నుంచి 20 యేళ్ల మధ్య వయసున్న కుర్రాళ్లను ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. కథ ప్రకారం సమంత, శర్వానంద్ క్లాస్‌మేట్స్. స్కూలు రోజుల నుంచే వాళ్ల మధ్య ప్రేమ అంకురిస్తుంది. దానికి సంబంధించిన సన్నివేశాల కోసం శర్వానంద్ పాత్రకు టీనేజ్ నటుడి అవసరమైంది. సమంత టీనేజ్‌లో ఉన్నప్పటి పాత్రకు కేస్టింగ్ కాల్ లేకపోవడాన్ని బట్టి ఆ పాత్రకు ఇప్పటికే ఎవరినైనా ఎంపిక చేసుండాలి.. లేదా సమంతే స్కూలు పిల్లలా నటిస్తుండాలి.

96 Remake: Casting Call For Young Sharwanand!
96 Remake: Casting Call For Young Sharwanand!

96 Remake Finally Has Samantha & Sharwa Are As The Official Casting