ANR Lives On: How Well Do You Remember Nata Samrat?


ANR Lives On: How Well Do You Remember Nata Samrat?

క్విజ్: అక్కినేని నాగేశ్వరరావు సినిమాల గురించి మీకెంత తెలుసు?

నేడు అక్కినేని నాగేశ్వరారావు వర్ధంతి. ఆయన కన్నుమూసి అప్పుడే ఐదేళ్లు గడిచిపోయాయి. చివరి సినిమా ‘మనం’లో ఆయన చిరునవ్వు ముఖం ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది. ఆయన మన మధ్య లేకపోయినా తన సినిమాలతో చిరస్మరణీయుడిగానే ఉంటారు. ఆయన సినిమాల గురించి ఒక్కసారి గుర్తుచేసుకొనే ప్రయత్నం ఈ క్విజ్.

1. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి ఏఎన్నార్ నటించిన చిత్రం

ఎ) సత్యం శివం

బి) చాణక్య చంద్రగుప్త

సి) రామకృష్ణులు

2. ‘చిగురాకులలో చిలుకమ్మా..’ పాట ఉన్న అక్కినేని చిత్రం

ఎ) దొంగరాముడు

బి) దేవదాసు

సి) ఆత్మగౌరవం

3. తెలుగుతో పాటు హిందీలోనూ ఏఎన్నార్ నటించిన చిత్రం

ఎ) నవరాత్రి

బి) సువర్ణసుందరి

సి) విప్రనారాయణ

4. గొల్లపూడి మారుతీరావు రచయితగా పరిచయమైన అక్కినేని చిత్రం

ఎ) జమీందార్

బి) మనసే మందిరం

సి) ఆత్మగౌరవం

5. ఏఎన్నార్ రెండు పాటలు పాడిన చిత్రం

ఎ) పల్నాటి యుద్ధం

బి) భక్త రామదాసు

సి) జయభేరి

6. పి. సుశీల గాయనిగా పరిచయమైన చిత్రం

ఎ) పరదేశి

బి) కన్నతల్లి

సి) దేవదాసు

7. ‘తోడికోడళ్లు’కు ఆధారమైన శరత్‌చంద్ర ఛటర్జీ నవల

ఎ) శేష్ ప్రశ్న

బి) శ్రీకాంత

సి) నిష్కృతి

8. ఏఎన్నార్, సావిత్రి అన్నాచెల్లెళ్లుగా నటించిన చిత్రం

ఎ) మిస్సమ్మ

బి) సంతానం

సి) పరివర్తన

ANR Lives On: How Well Do You Remember Nata Samrat?

9. ‘మహాకవి కాళిదాసు’ సినిమాలో నటనకు గాను అక్కినేనికి ‘కాళిదా కౌస్తుభ’ అవార్డుతో సత్కరించిన రాష్ట్ర ప్రభుత్వమేది?

ఎ) మధ్యప్రదేశ్

బి) ఉత్తరప్రదేశ్

సి) మహారాష్ట్ర

10. అక్కినేని ‘బుద్ధిమంతుడు’లో శ్రీకృష్ణ పాత్రధారి

ఎ) హరనాథ్

బి) శోభన్‌బాబు

సి) కాంతారావు

జవాబులు: 1. చాణక్య చంద్రగుప్త 2. దొంగరాముడు 3. సువర్ణసుందరి 4. ఆత్మగౌరవం 5. పల్నాటి యుద్ధం 6. కన్నతల్లి 7. నిష్కృతి 8. పరివర్తన 9. మధ్యప్రదేశ్ 10. శోభన్‌బాబు