Bharateeyudu 2: Akshay Kumar Will Be The Villain?

భారతీయుడు 2: విలన్ అక్షయ్ కుమార్?
కమల్ హాసన్ టైటిల్ పాత్రధారిగా దర్శకుడు శంకర్ రూపొందించే ‘భారతీయుడు 2’ షూటింగ్ రేపే (జనవరి 18) చెన్నైలో మొదలవనున్నది. కాజల్ అగర్వాల్ నాయికగా నటించే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడు. శంకర్ మునుపటి సినిమా ‘2.0’లో విలన్ పక్షిరాజా పాత్రను చేసిన అక్షయ్ కుమార్ ఈ సినిమాలోనూ విలన్ కేరెక్టర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శంకర్, కమల్ కాంబినేషన్లో 1994లో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్టయిన ‘భారతీయుడు’ (ఇండియన్)కు ఇది సీక్వెల్.
మొదట విలన్ రోల్‌కు బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అజయ్ దేవగణ్‌ను శంకర్ సంప్రదించారు. అది ఒక పోలీసాఫీసర్ కేరెక్టర్. అజయ్ కూడా మొదట ఆ పాత్రను చేయడానికి ఆసక్తి కనపర్చాడు. అయితే తెలీని కారణాల వల్ల అజయ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ‘2.0’కు కలిసి పనిచేసినప్పుడు తనకు మంచి మిత్రుడైన అక్షయ్‌ను శంకర్ సంప్రదించారనీ, అక్షయ్ కూడా చెయ్యాలనే ఆసక్తిని కనపర్చాడనీ సమాచారం. అయితే ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ధృవీకరించలేదు. ‘2.0’ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థే ఈ సినిమానీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.