Boyapati Srinu Interview


Boyapati Srinu Interview

నా హీరోకి అభిమానినైపోతా!: బోయ‌పాటి శ్రీను

రాంచరణ్‌, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను రూపొందించిన ‘వినయ విధేయ రామ’ చిత్రం జనవరి 11న విడుదలవుతోంది. తన దృష్టిలో సినిమా అనేది కలర్‌ఫుల్‌గా ఉండాలనీ, తను ఏ హీరోతో పనిచేస్తే ఆ హీరో అభిమానిలా చేస్తాననీ బోయపాటి అంటున్నారు. ‘వినయ విధేయ రామ’ గురించి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే…

  • వినయం, విధేయత ఉంది కాబట్టే రాముడయ్యాడు. ఈ రాముడు ఫ్యామిలీ పట్ల విధేయుడు. ఆ విధేయత ఏ స్థాయిలో ఉంటుందనేది మీరు సినిమాలో చూస్తారు.
  • ట్రైలర్‌లో రామ్ చరణ్ కటౌట్ చూస్తుంటే ఐరన్ మ్యాన్‌లా కనిపిస్తున్నాడు. ఆ బాడీలో ఈ రోజు ఉన్న మెచ్యూరిటీ నాలుగేళ్ల క్రితం లేదు. అందుకే పర్ఫెక్షన్ కోసం టైమ్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాకి ఇదే కరెక్ట్ టైమ్.
  • నేను చేసిన సినిమాలు ‘భద్ర’ నుండి ‘వినయ విధేయ రామ’ వరకు ఫ్యామిలీ ఎమోషన్స్‌కే ఫస్ట్ ఫౌండేషన్ ఉంటుంది. ఆ తరవాతే సొసైటీ గురించి చూస్తా. కథలో ఇంకా స్కోప్ ఉందనుకుంటే తక్కిన విషయాల గురించి ఆలోచిస్తా.
  • అజర్ బైజాన్ సీక్వెన్స్ ప్రిపేర్ చేసుకుని రామ్ చరణ్‌కి చెప్పినపప్పుడు, అప్పటికే 2 నెలల కన్నా ఎక్కువ టైమ్ లేదు. ఇప్పట్లో కష్టం అని నాకు తెలిసినా,” మీరు చేసేస్తారు” అని ఒక మాట అనేసి వెళ్ళిపోయా. ఆయన కూడా ఆ మాటని అలాగే తీసుకుని, నన్ను నమ్మాడు కాబట్టే అంతలా కష్టపడ్డాడు.
  • ‘వినయ విధేయ రామ’ విజన్ నుండి విజువల్ వరకు ఉన్న మెయిన్ కనెక్టివిటీ రామ్ చరణ్.. ఆయన లేకపోతే ఇది సాధ్యపడేది కాదు.
  • సినిమా అంటే పండుగ‌. పండుగ‌ని అభిమానుల వరకు చేర్చాలంటే ఆర్టిస్ట్ నన్ను నమ్మాలి. వాళ్ళు నన్ను నమ్మాలంటే వాళ్ళకన్నా ముందు నేను పదింతలు ఎక్సర్ సైజు చేసి, వాళ్ళను ఇన్‌స్పైర్ చేయగలగాలి. ఈ ప్రాసెస్‌లో ఆర్టిస్టుల కన్నా కథలో నేనే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాను. కథ చెప్పేటప్పుడే ఎఫెక్ట్స్ సహా వివరంగా చెప్తాను.
  • మాస్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు సినిమాలో ఒక కొత్త పాయింట్‌ని విన‌య విధేయ రామ‌లో రైజ్ చేశాం. అది ఆడియెన్స్‌కి రీచ్ అవుతుంది.
Boyapati Srinu Interview
  • సినిమాలో క్యారెక్టర్స్ కూడా ఎవరు అందుబాటులో ఉన్నారో వారిని తీసుకోవడం జరగలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, హీరోకి పెద్దన్నయ్య అన్నప్పుడు… ఎవరిని తీసుకున్నా ఈ కేరక్టర్‌లో పర్ఫెక్ట్‌గా సింక్ అవ్వాలి. అందుకే ఆ పాత్రకు ప్రశాంత్ వచ్చారు. అలా వరసగా ఏజ్ దగ్గరి నుండి పర్ఫామెన్స్ లెవెల్స్ వరకు ప్రతీది క్షుణ్ణంగా ఆలోచించి డెసిషన్ తీసుకోవడం జరిగింది.
  • వివేక్ ఒబెరాయ్‌గారినిని కలిసినపుడు ఆయన అన్న మొదటి మాట “నేను చేయను” అని. “నేను ‘రక్త చరిత్ర’ సినిమా చేశాను. మళ్ళీ అదే స్థాయి సినిమా అయితే తప్ప నేను ఆలోచించనండి” అని చెప్పాడు. “సరే సర్.. మీరు చేయకండి కానీ, ఒకసారి క్యారెక్టర్ వినండి” అని చెప్పాను. అంతే! విన్నాడో లేదో.. డేట్స్ ఇచ్చేశాడు. అదే కమిట్‌మెంట్‌తో వచ్చాడు, చేసేశాడు.. వెళ్ళిపోయాడు.
  • నా దృష్టిలో సినిమా అంటే కలర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకే ఎక్కువగా అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో కథల్ని ఎంచుకుంటాను. అందుకే ప్రతి సినిమాలో రిచ్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ అన్పిస్తుందేమో..
  • ఏ సినిమాకైనా నిర్మాతదే ప్రధాన పాత్ర. జ్యూస్ నాదైనా మంచి గ్లాస్ ఉండాలి. అందుకే రామ్ చరణ్, నాకు డీవీవీ దానయ్య గారైతేనే బెటర్ అని చెప్పారు. సినిమా ఈ రోజు ఇంత అద్భుతంగా వచ్చిందంటే అది ఆయన వల్లే పాసిబుల్ అయింది.
  • నాకు రామ్ చరణ్‌లో ఎక్కువగా నచ్చింది ఒకటే. ఆయనకు అసలు తృప్తి ఉండదు. ఎంత సాధించినా ఇంకా ఏదో చేయాలి అనుకుంటూ ఉంటాడు. సినిమా సినిమాకి ఎదుగుతూనే ఉంటాడు. ఇంకా ఆశగా చూస్తూనే ఉంటాడు.
  • నేను చిన్న సినిమాలు చేయలేను. నా నుండి ఆడియెన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది 100% ఇవ్వాలి అని నేననుకుంటా. అవతల ఎక్స్‌పెక్టేషన్స్ ఒకలా ఉండి, మ‌న ప్రొడ‌క్ట్ ఇంకోలా ఉంటే మ్యాచ్ అవ్వదు. అందుకే నేను చిన్న సినిమాలు చేయను. ఒకవేళ నేను బయోపిక్ చేసినా, అందులో కూడా దమ్ము కంపల్సరీగా ఉంటుంది.
  • ఏ హీరోతో సినిమా చేసినా, ఆ హీరోకి అభిమానినై చేస్తా. చరణ్ కోసం సినిమా రాసుకున్నప్పుడు కూడా ఫ్రంట్ సీట్లో కూర్చుని చూస్తున్నట్టుగా ఫీలై కథ రాసుకున్నా. ప్రతి హీరోకి అదే చేస్తా. ఇది కూడా అలాంటి సినిమానే.