Dil Raju Is Back With A Bang!

సంక్రాంతి విజేత దిల్ రాజు
నిర్మాతగా దిల్ రాజు్కు 2018 పెద్దగా కలిసి రాలేదు. మూడు సినిమాలు నిర్మిస్తే ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమా మాత్రమే బ్రేకీవెన్ సాధించి కొద్దిగా లాభాలు తెచ్చింది. ఎంతగానో ఆశించిన ‘శ్రీనివాస కల్యాణం’ దెబ్బకొట్టి, డిజాస్టర్‌గా నిలిచింది. ‘లవర్’ సినిమా ఫ్లాపయింది. అంతకు ముందు 2017 ఆయనకు మరపురాని సంవత్సరంగా గుర్తుండిపోయింది. ‘శతమానం భవతి’, ‘నేను లోకల్’, ‘ఫిదా’, ‘రాజా ద గ్రేట్’, ‘ఎంసీఏ’ సినిమాలు మంచి లాభాలు తెచ్చాయి. ఒక్క ‘దువ్వాడ జగన్నాథం’ మాత్రమే ఆశించిన రీతిలో వసూళ్లు తేలేదు. ఈ నేపథ్యంలో 2019 ఆయనకు అమితానందాన్ని కలిగించే రీతిలో మొదలైంది. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా ఆయన నిర్మించిన ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. సంక్రాంతి విజేతగా నిలిచింది. సకుటుంబ చిత్రాల నిర్మాతగా తనకున్న పేరును బలపరచుకుంటూ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఆయన నిర్మిచిన ‘ఎఫ్2’ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 50 కోట్ల షేర్ మార్కును దాటేసింది. ఇప్పటికీ అనూహ్యమైన వసూళ్లను సాధిస్తూ రూ. 60 కోట్ల మార్కును చేరుకునేలా కనిపిస్తోంది. దిల్ రాజు మార్కెట్ పరపతి మరింత పెంచింది ఈ సినిమా.
