Does Shatamanam Bhavati Director Back On The Track With All Is Well?


Does Shatamanam Bhavati Director Back On The Track With All Is Well?
Does Shatamanam Bhavati Director Back On The Track With All Is Well?

‘శతమానం భవతి’ డైరెక్టర్‌కి అంతా బాగేనా?

శర్వానంద్ హీరోగా రూపొందించిన ‘శతమానం భవతి’ చిత్రంతో దర్శకుడిగా సతీశ్ వేగేశ్న పేరు మారుమోగింది. అదివరకు దర్శకుడిగా చేదు అనుభవాలు చూసిన ఆయనకు దిల్ రాజు నిర్మించిన ఆ సినిమా ఎంతో క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా దిల్ రాజు నిర్మాణంలోనే ‘శ్రీనివాస కల్యాణం’ సినిమా తీశాడు సతీశ్. డ్రామా కంటే ఉపన్యాసాలే ఎక్కువవడం, మన సంస్కృతీ సంప్రదాయాలు ఎంతగొప్పవనే సందేశాలు ఇవ్వడానికే సినిమాని ప్రధానంగా ఉపయోగించుకోవడంతో నేటి ప్రేక్షకులు ఆ సినిమాతో సహానుభూతి చెందలేకపోయారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద బాగా దెబ్బతింది ఆ సినిమా. ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకొని తన తదుపరి సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశాడు సతీశ్. దానికి ‘ఆల్ ఈజ్ వెల్’ అనే టైటిల్ కూడా పెట్టేశాడు. ఇప్పటివరకు మ్యూజిక్, డిజిటల్ ఇండస్ట్రీలో ఉన్న ఆదిత్యా మ్యూజిక్ అధినేత ఉమేశ్ గుప్తా ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. కాగా ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారని వినిపిస్తోంది. అతి త్వరలోనే వాళ్ల పేర్లు వెల్లడి కానున్నాయి. ‘ఆల్ ఈజ్ వెల్’ సినిమాతో మునుపటి చేదు అనుభవాన్ని మరిచిపోవాలని భావిస్తున్నాడు సతీశ్.