F2 In US: Joined In Million Dollar Club


F2 In US: Joined In Million Dollar Club

మిలియన్ డాలర్ల క్లబ్బులో ‘ఎఫ్2’

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించిన ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమా యు.ఎస్. మార్కెట్‌లో విజయ కేతనం ఎగురవేసింది. సగర్వంగా మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరింది. సంక్రాంతికి విడుదలైన మూడు తెలుగు సినిమాల్లో ఈ ఫీట్‌ను సాధించిన సినిమాగా నిలిచింది. శుక్రవారం ప్రేమియర్స్ ద్వారానే 2.49 లక్షల డాలర్లను వసూలు చేసిన ‘ఎఫ్2’ సోమవారం సాధించిన 75 వేల డాలర్లతో 10.02 లక్షల డాలర్లను (1 మిలియన్ డాలర్లను) చేరుకుంది. అనిల్ రావిపూడికి ఇదే తొలి మిలియన్ డాలర్ల సినిమా. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత వెంకీని మరోసారి ఆ క్లబ్బులో చేర్చిన సినిమా ఇదే. ఇక వరుణ్‌కైతే ఇది మూడో మిలియన్ డాలర్ల సినిమా. ఇదివరకు ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ సినిమాలు ఈ ఫీట్‌ను సాధించాయి. తన సినిమా మిలియన్ డాలర్లను వసూలు చేయడంపై డైరెక్టర్ అనిల్ తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.