F2: No Censor Cuts But U/A Certificate

ఎఫ్2: సెన్సార్ కట్స్ లేవు కానీ..
వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా ‘యు’ సర్టిఫికెట్‌ను అందించడానికి సెన్సార్ బోర్డ్ నిరాకరించింది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడానికి అంగీకరించింది. నిర్మాత దిల్ రాజు సరేననడంతో ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఖాయమైంది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పూర్తి స్థాయి హాస్యభరితంగా రూపొందింది. కొన్ని సన్నివేశాలు, సంభాషణలు పిల్లలు చూసేందుకు, వినేందుకు అభ్యంతరకరంగా ఉన్నాయని సెన్సార్ సభ్యులు భావించారు. అందుకే ‘యు/ఎ’ సర్టిఫికెట్‌కు సిఫార్సు చేశారు. ఆంధ్రా అల్లుడిగా వెంకటేశ్, తెలంగాణ అల్లుడిగా వరుణ్‌తేజ్ జనవరి 12 నుంచి నవ్వులు పంచడానికి సిద్ధమవుతున్నారు.