Fidaa Quiz: How Well Do You Know Bhanumathi?


Fidaa Quiz: How Well Do You Know Bhanumathi?
Fidaa Quiz: How Well Do You Know Bhanumathi?

‘ఫిదా’ క్విజ్: సాయిపల్లవి పాత్ర గురించి మీకెంత తెలుసు?

శేఖర్ కమ్ముల రూపొందించిన ‘ఫిదా’ చిత్రం సాయిపల్లవిని తెలుగు ప్రేక్షకులకు అపూర్వంగా పరిచయం చేసింది. టైటిల్‌కు తగ్గట్లే పల్లవి నటనకు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. ఆమె చేసిన భానుమతి పాత్ర వాళ్ల హృదయాలపై చెరగని ముద్ర వేసింది. ఆ ముద్ర ఎంత బలంగా వేసిందో తెలుసుకోడానికే ఈ చిన్న క్విజ్.

1. “బాడకోవ్. బలిసిందా రా. బొక్కలిరగ్గొడతా. నఖరాలా!” అంటూ భానుమతి పరిచయమైన్ చోటు

ఎ) బస్ స్టేషన్  బి) రైల్వే స్టేషన్  సి) ఎయిర్‌పోర్ట్

2. భానుమతి ఏం చదువుకుంటోంది?

ఎ) బీకాం సెకండియర్  బి) ఇంజినీరింగ్ సెకండియర్  సి) బీఎస్సీ అగ్రికల్చరల్ సెకండియర్

3. వరుణ్‌ను రిసీవ్ చేసుకోడానికి వెళ్లినప్పుడు భానుమతి చార్టుమీద రాసుకొని తలకిందులుగా పట్టుకొన్న అక్షరాలు

ఎ) పెండ్లికొడుకు తమ్ముడు  బి) వరుణ్  సి) అమెరికా అబ్బాయి

4. వరుణ్‌ను భానుమతి రిసీవ్ చేసుకొని కారులో వెళ్తుండగా వరుణ్ తనను పరిచయం చేసుకొని “మీ పేరు?” అనడిగితే భానుమతి చెప్పే సమాధానం

ఎ) భానుమతి  బి) పెండ్లికూతురి చెల్లి  సి) పల్లెటూరి అమ్మాయి

5. వరుణ్‌ను తనతో బజారుకు నడుచుకుంటూ తీసుకుపోతూ భానుమతి ఇద్దరు హీరోల పేర్లు చెప్పి, “బ్లడ్‌లో వాళ్లుంటే ఆ మజా ఉంటది జూడు.. కిరాక్” అంటుంది. ఎవరా ఇద్దరు హీరోలు?

ఎ) ప్రభాస్, ఎన్టీఆర్  బి) అల్లు అర్జున్, రాంచరణ్  సి) పీకే (పవన్ కల్యాణ్), మహేశ్‌బాబు

6. వరుణ్‌ను భానుమతి తీసుకెళ్లే గుడి

ఎ) మల్లన్న గుడి  బి) సీతమ్మ గుడి  సి) రాములోరి గుడి

7. కాలేజీలో స్టూడెంట్లను వరుణ్ కొట్టడానికి కారణం

ఎ) భానుమతి పుట్టుమచ్చ  బి) భానుమతిని సీనియర్లు ర్యాగింగ్ చేయడం  సి) వాళ్లను కొట్టమని భానుమతి రెచ్చగొట్టడం

8. భానుమతి అక్క రేణుక పెళ్లయ్యాక ఇద్దరూ మాట్లాడుకునేప్పుడు రాజకుమారుడు ఏ గుర్రం మీద వచ్చి రాజకుమారిని తీసుకుపోతాడని రేణుక అంటుంది?

ఎ) తెల్లగుర్రం  బి) ఎగిరే గుర్రం  సి) రెక్కల గుర్రం

9. వరుణ్, భానుమతి ఫోన్‌లో గొడవపడేప్పుడు “నువ్వు నచ్చలేదు” అని భానుమతి అంటే, భానుమతి ఎలా ఉంటుందని వరుణ్ అంటాడు?

ఎ) యావరేజ్  బి) ఎబోవ్ యావరేజ్  సి) బిలో యావరేజ్

10. తనను గురించి చెప్పుకుంటూ భానుమతి అనే మాట

ఎ) భానుమతి.. ఒన్ పీస్  బి) భానుమతి.. ఒన్ వండర్  సి) భానుమతి.. ఒన్ స్టార్

Fidaa Quiz: How Well Do You Know Bhanumathi?
Fidaa Quiz: How Well Do You Know Bhanumathi?

జవాబులు: 1. రైల్వే స్టేషన్ 2. బీఎస్సీ అగ్రికల్చరల్ సెకండియర్ 3. పెండ్లికొడుకు తమ్ముడు 4. పెండ్లికూతురి చెల్లి 5. పీకే (పవన్ కల్యాణ్), మహేశ్బాబు 6. మల్లన్న గుడి 7. భానుమతి పుట్టుమచ్చ 8. రెక్కల గుర్రం 9. బిలో యావరేజ్ 10. భానుమతి.. ఒన్ పీస్