First Look Image From Teja’s SITA Revealed


First Look Image From Teja's SITA Revealed

తేజ ‘సీత’ ఫస్ట్ లుక్ వచ్చేసింది!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘సీత’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సాయి శ్రీనివాస్, కాజల్  ఇద్దరూ నోళ్లు పూర్తిగా తెరిచి ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌తో కాజల్ వరుసగా రెండో సినిమా చేస్తుండటం గమనార్హం. గత ఏడాది ఆ ఇద్దరూ జంటగా ‘కవచం’లో కనిపించారు. దర్శకుడు తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత  వైవిధ్యమైన కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో సోనూ సూద్, మన్నారా చోప్రా మరో రెండూ కీలక పాత్రలు చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి శీర్ష రాయ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: కణల్ కన్నన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిసోర్ గరికపాటి, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్.