Hansika’s Private Pictures Leaked


Hansika's Private Pictures Leaked

హన్సిక వ్యక్తిగత చిత్రాలు బహిర్గతం

షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్‌కు గురైన ఒక రోజు తర్వాత అందాల తార హన్సిక సైతం హ్యాకర్ల బారిన పడింది. 27 సంవత్సరాల హన్సిక బికినీతో ఉన్న ప్రైవేట్ ఫొటోలను హ్యాకర్లు ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. సోషల్ మీడియాలో వైట్ కలర్ టు-పీస్ బికినీతో ఉన్న ఆమె ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. మొదట ఒక ఇన్‌స్టాగ్రాం పేజీలో స్వింసూట్‌లోని ఆ ఫొటోలు బహిర్గతమవగా, తర్వాత వాటిని తొలగించారు. ఆ ఫొటోలు ఇటీవల ఆమె న్యూయార్క్‌లో గడిపిన సెలవు రోజులకు సంబంధించినవి.

ట్విట్టర్‌లోనూ మరికొన్ని పిక్చర్లు షేర్ కాగా, తర్వాత వాటిని కూడా తొలగించారు. ఇలాంటివి జరగడం హన్సికకు ఇదే తొలిసారి కాదు. గతంలో ఆమె పేరిట ఒక నగ్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తర్వాత, ఆ క్లిప్పింగ్‌లో ఉన్నది తాను కాదని స్పష్టం చేసింది హన్సిక. కాగా ప్రస్తుతం బహిర్గతమైన తన ఫొటోలకు సంబంధించి హన్సిక ఎలాంటి కామెంటూ చెయ్యలేదు. అలాగే ఇప్పటివరకు ఎవరికీ ఫిర్యాదూ చెయ్యలేదు.