I’m Not Doing Geetha Govindam Remake: Ishaan Khattar


I'm Not Doing Geetha Govindam Remake: Ishaan Khattar

‘గీత గోవిందం’ రీమేక్ నేను చేయట్లేదు: ఇషాన్ ఖట్టర్

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ పేరు తెలుగునాటే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగింది. తమిళంతో పాటు హిందీలోనూ ఆ సినిమా రీమేక్ అవుతోంది. హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో తయారవుతున్న రీమేక్‌లో షాహిద్ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. 2018 బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో ఒకటైన ‘గీత గోవిందం’ సినిమా కూడా హిందీలో రీమేక్ కానున్నట్లు సమాచారం. అందులో ‘ధడక్’ ఫేం ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించనున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఒక ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో “ఆ సినిమా నేను చేయట్లేదు” అని క్లారిఫై చేశాడు ఇషాన్. మరైతే ఎవరు చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. విజయ్ స్వయంగా ఆ రీమేక్‌లో చేసే అవకాశం ఉన్నట్లు కూడా వినిపించింది. అయితే రీమేక్స్ చెయ్యడం తనకు ఇష్టం లేదని విజయ్ తెలిపాడు. హిందీలో చేస్తే ఒరిజినల్ స్టోరీతోటే సినిమా చేస్తానని అతను చెప్పాడు.