Jr.NTR As Chief Guest For Mr.Majnu Pre Release Function


Jr.NTR As Chief Guest For Mr.Majnu Pre Release Function

మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు తారక్ చీఫ్ గెస్ట్

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. థమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. ఆ పాటల్లో అఖిల్ డాన్సులు కూడా అలరిస్తున్నాయి. అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను జనవరి 19న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నట్లు హీరో అఖిల్ ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. అంతేకాకుండా, ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలియజేశాడు. ‘సవ్యసాచి’తో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్ ఈ చిత్రంలో అఖిల్ సరసన కనిపించనున్నది. అలాగే బ్రెజిల్‌కు చెందిన మోడల్ ఇజాబెల్లా లీటే కూడా ఈ చిత్రంలో సందడి చేయనున్నది.