Karthikeya New Film Started!

‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ మరో చిత్రం మొదలైంది!
కార్తికేయ కథానాయకుడిగా వచ్చిన ‘ఆర్ ఎక్స్ 100’ సెన్సేషనల్ విజయాన్ని అందుకొని, అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. చిన్న సినిమాతో వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. దాంతో ఆయనతో సినిమా చేసేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఆయన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు. అర్జున్ జంధ్యాలకు గతంలో బోయపాటి శ్రీను దగ్గర పనిచేసిన అనుభవం ఉంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (జనవరి 17) నుంచి ఒంగోలులో మొదలైంది. కొన్ని ముఖ్య సన్నివేశాలు, రెండు పాటలు మొదటి షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారు. ఫిబ్రవరి 8 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వీరి మొదటి చిత్రం. త్వరలో మిగతా వివరాలు తెలియజేస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీత దర్శకుడు, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ రామ్ సినిమాటోగ్రాఫర్.