Lakshmi’s NTR Is A Theater Actor: Ram Gopal Varma


Lakshmi's NTR Is A Theater Actor: Ram Gopal Varma

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఒక రంగస్థల నటుడు: రాంగోపాల్ వర్మ

ఎన్టీఆర్ నిజ జీవితాన్ని చెబుతున్నానంటూ రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. లక్ష్మీపార్వతి దృష్టికోణం నుంచి ఈ సినిమాని ఆయన తీస్తున్నారు. కాగా జనవరి 18న ఆయన యూట్యూబ్‌లో విడుదల చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ పునర్జన్మదర్శనం’ వీడియోకు మంచి స్పందన లభించింది. ఇందులో కేవలం ఎన్టీఆర్ పాత్రధారిని మాత్రమే ఆయన చూపించారు. అయితే ఆ నటుడెవరనే విషయం ఎవరూ కనిపెట్టలేకపోయారు. వర్మ సైతం ఆయన పేరును వెల్లడించలేదు. ఆయన పశ్చిమగోదావరికి చెందిన రంగస్థల నటుడని మాత్రం తెలిపారు. ఆయనకు తాను ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, నడవడిక, మాట్లాడే తీరుపై నెలల తరబడి శిక్షణ ఇచ్చానని కూడా ట్విట్టర్ ద్వారా వర్మ తెలిపారు. అయితే వర్మ ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఆ నటుడు ఎన్టీఆర్‌లా కనిపించకపోవడం గమనార్హం. లక్ష్మీపార్వతి పాత్రలో కన్నడ తార యజ్ఞాశెట్టి నటించిన ఈ సినిమాని రాకేశ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. చంద్రబాబునాయుడిగా శ్రీతేజ్ నటించిన ఈ చిత్రానికి కల్యాణీ మాలిక్ సంగీత దర్శకుడు.