Manikarnika Controversy: Krish’s Strong Reply To Rangoli


Manikarnika Controversy: Krish's Strong Reply To Rangoli
Manikarnika Controversy: Krish’s Strong Reply To Rangoli

రంగోలికి క్రిష్ ఘాటు జవాబు

కంగనా రనౌత్ సోదరి రంగోలికి క్రిష్ ఘాటుగా సమాధానమిచ్చారు. తనను అవకాశవాదిగా, అబద్ధాలకోరుగా అభివర్ణించిన ఆమెకు ఆమె పద్ధతిలోనే స్పందించారు. రచయిత విజయేంద్రప్రసాద్‌కు కంగన పంపిన వాట్సాప్ మెసేజ్‌లను ఆమె బయటపెడితే, ‘మణికర్ణిక’కు పనిచేసిన టెక్నీషియన్లు తనతో పంచుకున్న అభిప్రాయాలను వాళ్ల అనుమతితో బహిరంగపరిచాడు క్రిష్. వాటిలో క్రిష్‌ను సపోర్ట్ చేసిన వాళ్లు, ఆయన డైరెక్ట్ చేసిన సినిమాతో పోలిస్తే, ఆయన తీసిన కొన్ని సన్నివేశాల్ని తీసేసి, తాను డైరెక్ట్ చేసిన సన్నివేశాల్ని కలిపి కంగన విడుదల చేసిన సినిమా తీసికట్టుగా ఉందంటూ తేల్చేశారు. తన పేరును క్రిష్ జాగర్లమూడి లేదా క్రిష్ అని కాకుండా రాధాకృష్ణ జాగర్లమూడి అని పెట్టడం వెనుక కారణమేమిటంటూ ఆయన రంగోలిని ప్రశ్నించాడు. ఆ సినిమాకు పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్లు సుజిత్, శ్రీరాం తనతో వాట్సాప్ ద్వారా పంచుకున్న అభిప్రాయాల్ని షేర్ చేశారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్లు పంచుకున్న అభిప్రాయాల్నీ బహిర్గతం చేశారు. వారిలో ఒకరైతే ఈ విషయాన్ని నిర్మాతల సంఘానికి ఫిర్యాదు చేయాల్సిందిగా కూడా సూచించారు. తాను 75 శాతం సినిమా షూట్ చేశానని కంగన చెబ్తున్నదంతా అబద్ధమని నటాషా అనే అసిస్టెంట్ డైరెక్టర్ తేల్చేశారు.

“హస్తలాఘవాలు, అబద్ధాల మీద నా సినిమా రూపకల్పన సామర్థ్యాన్ని డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. రంగోలీ.. నువ్వు బయటపెట్టిన మెసేజ్‌లన్నీ నా గురించి మీ సోదరి చెప్పిన మాటలే” అని ఆయన ట్వీట్ చేశాడు. అంతేకాదు, “ఆ వాట్సాప్ మెసేజ్‌లలో కంగన రాసింది చూస్తే, నేను ఆమెను ఎప్పుడైతే ప్రశ్నిస్తానో, అప్పుడు బయటపెట్టడానికి రాసిన పూర్తి అబద్ధాలు, ముందుగా ప్రిపేర్ చేసుకున్నవనీ, ఇలాంటి రోజొకటి వస్తుందని ముందే ఊహించి రాసినవనీ నమ్మకంగా చెప్తున్నా” అని కూడా ఆయన పేర్కొన్నారు.