Mithai Release Date Announced


Mithai Release Date Announced

‘మిఠాయి’ విడుదల తేదీని ప్రకటించిన ‘అర్జున్‌రెడ్డి’ డైరెక్టర్

బిహారీ అయిన ప్రశాంత్‌కుమార్ తెలుగులో తీస్తున్న సినిమా ‘మిఠాయి’. హాస్య నటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 22న విడుదల కానున్నది. ఈ విషయాన్ని ‘అర్జున్‌రెడ్డి’ డైరెక్టర్ వంగా సందీప్‌రెడ్డి ప్రకటించారు. ప్రశాంత్‌కుమార్ రూపొందించిన ‘మిఠాయి’ విడుదల తేదీని తనతో ప్రకటింపజేస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. తెలుగులో ఈ సినిమా తీసినందుకు తామంతా గర్విస్తున్నామనీ, తెలుగు చిత్రసీమలోకి స్వాగతమనీ ఆయన పేర్కొన్నారు.

‘మిఠాయి’ ఇద్దరు మిత్రుల కథ. వాళ్ల జీవితాల్లో చోటు చేసుకున్న కొన్ని అవాంఛనీయ ఘటనల కథ. తమ జీవితాల్లో కీలక సమయంలో ఎదురైన ఆ ఘటనలను వాళ్లెలా ఎదుర్కొన్నారనే విషయాన్ని వినోదాత్మకంగా చూపించిన డార్క్ కామెడీ ఈ సినిమా. రాహుల్ పనిచేసే కంపెనీ సీఈఓగా అజయ్ ఘోష్ ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాటల లిరికల్ వీడియోలు యూట్యూబ్‌లో విడుదలై ఆదరణ పొందుతున్నాయి. రెడ్ యాంట్స్ బేనర్‌పై ప్రశాంత్‌కుమార్ స్వయంగా ఈ సినిమా నిర్మించారు. కమల్ కామరాజు, శ్వేతావర్మ కీలక పాత్రలు చేశారు.