Mr.Majnu: Pandaga Song To Celebrate Sankranthi


Mr.Majnu: Pandaga  Song  To Celebrate Sankranthi

‘చిరు చిరు నవ్వుల…’: మిస్టర్ మజ్ను నుంచి పండుగ పాట

అఖిల్ అక్కినేని హీరోగా ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో  ‘మిస్టర్ మజ్ను’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ ఆడిపాడుతోంది. ఈ సినిమా ఆడియో జూక్ బాక్స్ ను ఇటీవలే విడుదల చేశారు. దానికి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోందని యూనిట్ సభ్యులు తెలిపారు. 

సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజు ‘చిరు చిరు నవ్వుల…’ పాట వీడియో ప్రోమోను విడుదల చేశారు. ఈ సినిమా నుండి అంతకుముందు విడుదలయిన పాటలకు పూర్తి భిన్నంగా కుటుంబ నేపథ్యంలో ఉంది. షూటింగ్ చివరగా పెళ్లికి సంబంధించిన సంగీత్ సాంగ్‌ను చిత్రీకరించినట్లు ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ఇప్పుడు విడుదల చేసిన పాట అదే అయ్యింటుంది. థమన్ సంగీతం అలరిస్తుంది. ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.