Mr Majnu: Vikky Slapped By Nikky 3 Times!


Mr Majnu: Vikky Slapped By Nikky 3 Times!

మిస్టర్ మజ్ను: నిక్కీ చేతిలో మూడుసార్లు దెబ్బలు తిన్న విక్కీ

సాధారణంగా మన తెలుగు సినిమాల్లో హీరోలదే ఎప్పుడూ పైచేయి. హీరోయిన్లని ఏడిపించడంలో వాళ్లే ఎప్పుడూ ముందుంటారు. అడపాదడపా మాత్రమే హీరోయిన్లు పైచేయి సాధిస్తుంటారు. ఒక క్రేజ్ ఉన్న హీరో సినిమాలో హీరోయిన్ పైచేయి సాధించడం చాలా అరుదు. అలాంటి అరుదైన విషయం ‘మిస్టర్ మజ్ను’లో చోటు చేసుకుంది. ఈ సినిమాలో హీరో కంటే హీరోయిన్‌ను ఒక మెట్టుపైన ఉంచాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ద్వితీయార్థమంతా ఆమెను ప్రసన్నం చేసుకొని, తనదాన్ని చేసుకోవాలని చేసే ప్రయత్నంలో నిక్కీ (నిధి అగర్వాల్)ని విక్కీ (అఖిల్) కంటే పైమెట్టులో కూర్చోబెట్టాడు. అంతేకాదు.. సినిమాలో ఒకసారి కాదు, మూడుసార్లు విక్కీని కొడుతుంది నిక్కీ. ప్రథమార్థంలో ఒకసారి, ద్వితీయార్థంలో ఇంకోసారి చెంపపై కొట్టిన ఆమె, ఇంకోసారి రెండు కుటుంబాలవాళ్లు లంచ్ చేస్తున్నప్పుడు విక్కీ డిప్పపై కొడుతుంది. మొదటిసారి అతడు తనను ముద్దు పెట్టుకోబోయినప్పుడు చెంపపై కొట్టిన ఆమె, సినిమా చివరలో అతడు ఇంకో అమ్మాయితో దగ్గరగా ఉండటం చూసి సహించలేక చెంపపై కొడుతుంది. ఇక ఫస్టాఫ్‌లో ఒకసారి విక్కీ బాబాయ్ వాళ్లింట్లో అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు అందరికీ వడ్డన చేస్తున్న నిక్కీ మధ్యలో చనువుగా విక్కీ డిప్పపై గట్టిగా ఒక్కటిస్తుంది. దాంతో అందరూ అవాక్కయి చూస్తారు. నిక్కీ నాలుక్కరుచుకుంటుంది. విక్కీ కూడా ఖంగుతిని తలెత్తకుండా బుద్ధిగా తలొంచుకొని తింటాడు.