Naga Chaitanya To Team Up With Dil Raju After 10 Years


Naga Chaitanya To Team Up With Dil Raju After 10 Years
Naga Chaitanya To Team Up With Dil Raju After 10 Years

పదేళ్ల తర్వాత కలిసి పనిచేయనున్న నాగచైతన్య, దిల్ రాజు

అక్కినేని నాగచైతన్య, నిర్మాత దిల్ రాజు రెండో సారి కలిసి పనిచెయ్యబోతున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు  తెలియజేశారు. చైతూని హీరోగా పరిచయం చేసింది రాజే. వాసు వర్మ దర్శకత్వంలో 2009లో వచ్చిన ఆ సినిమా ‘జోష్’. టైటిల్‌కు భిన్నమైన ఫలితాన్ని ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద చవి చూసింది. ప్రేక్షకులు దాన్ని నిరాదరించారు. పదేళ్ల తర్వాత తిరిగి కలిసి పని చెయ్యాలని ఆ ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ద్వారా శశి అనే దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. రాజు నిర్మించిన కొన్ని చిత్రాలకు శశి దర్శకత్వ శాఖలో పనిచేశాడు. అతను చెప్పిన కథ చైతూకు బాగా నచ్చడంతో ఓకే చెప్పేశాడు. ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్‌లోకి వెళ్లనుంది. చైతూ ప్రస్తుతం సమంత జోడీగా ‘మజిలీ’ సినిమాతో పాటు వెంకటేశ్‌తో కలిసి ‘వెంకీ మామ’ అనే మల్టీస్టారర్ చేస్తున్నాడు. మరో వైపు ‘ఎఫ్2’ సక్సెస్‌తో మంచి జోష్ మీదున్న దిల్ రాజు ఈ ఏడాది నాలుగు నుంచి ఆరు సినిమాలు ప్రొడ్యూస్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.