NTR: KathanayakuDu – A New Record In Balakrishna’s Career


NTR: KathanayakuDu - A New Record In Balakrishna's Career

రికార్డు సృష్టించిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’

బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ చిత్రం విడుదలకు ముందు అంచనాలకు తగ్గట్లే బ్రహ్మాండమైన బిజినెస్ సాధించింది. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధికంగా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు అనూహ్యమైన రీతిలో ప్రప్రంచవ్యాప్తంగా రూ. 71.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు బాలకృష్ణ సినిమా ఏదీ రూ. 50 కోట్ల షేర్‌ను సాధించలేదు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఆ మార్కుకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. అలాంటిది ఎన్టీఆర్ బయోపిక్ కావడంతో బయ్యర్లు ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ను కొనేందుకు పోటీపడ్డారు. వివిధ ప్రాంతాలకు థియేటర్ హక్కులు కొన్న డిస్ట్రిబ్యుషన్ సంస్థలేవో చూద్దాం…

ఏపీ/తెలంగాణ

నైజాం – గ్లోబల్ సినిమాస్
సీడెడ్ – వారాహి చలన చిత్రం
ఉత్తరాంధ్ర – వారాహి చలన చిత్రం
కృష్ణ – వారాహి చలన చిత్రం
గుంటూరు – పద్మాకర్ సినిమాస్
నెల్లూరు – వాణి థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్
తూర్పు గోదావరి – వింటేజ్ క్రియేషన్స్
పశ్చిమ గోదావరి – ఉషా పిక్చర్స్

ఓవర్సీస్ – యుఎస్ తెలుగు
కర్ణాటక – వారాహి చలన చిత్రం
తమిళనాడు – ఎస్‌పిఐ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్
ఒడిష – ధీరజ్ ఫిలిమ్స్
నార్త్ ఇండియా – ఎఎ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్