NTR Kathanayakudu: Shocking Disaster


NTR Kathanayakudu: Shocking Disaster

యన్.టి.ఆర్ కథానాయకుడు: షాకింగ్ డిజాస్టర్

ఇది అనూహ్యం. ఎన్టీఆర్ జీవిత గాథ వెండితెరపై వెలిగిపోతుందనీ, ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనీ ఆశిస్తే, జరిగింది అందుకు పూర్తి భిన్నం. వసూళ్ల వర్షం కురుస్తుందనుకుంటే, తుంపర్లు మాత్రమే రాలుతున్న వైనం. నిజంగా ఎన్టీఆర్ బయోపిక్‌తో చరిత్ర సృష్టిద్దామనుకున్నవాళ్లు నివ్వెరపోయేలా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ చిత్రం. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించగా, క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో కేవలం రూ. 14.21 కోట్లనే వసూలు చేయగలిగింది. ఈ రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రి బిజినెస్ విలువ రూ. 55 కోట్లు కావడం గమనార్హం. అంటే ఇప్పటివరకు వచ్చింది కేవలం సుమారు 26 శాతం మాత్రమే. ఇంకా 74 శాతం రావాల్సి ఉంది. మహా అయితే ఇంకో నాలుగు శాతానికి మించి రికవర్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 70 శాతం మేర నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో బయ్యర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సీడెడ్ ఏరియాలో అయితే కలెక్షన్లు మరీ తీసికట్టుగా ఉన్నాయి. ఇక్కడ రూ. 12 కోట్ల విలువకు గాను 9 రోజులకు వసూలయ్యింది రూ. 1.65 కోట్లు మాత్రమే!