Pink Remake: Vidya Balan Is Pairing Up With Ajith


Pink Remake: Vidya Balan Is Pairing Up With Ajith
Pink Remake: Vidya Balan Is Pairing Up With Ajith

అజిత్ జోడీగా విద్యా బాలన్!

‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయమైన విద్యా బాలన్ త్వరలో ‘పింక్’ రీమేక్ ద్వారా నేరుగా తమిళ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. బోనీ కపూర్ మీద గౌరవంతోనే తాను ఆ సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే విద్య వెల్లడించారు. కాగా ఆ సినిమాలో ఆమె అజిత్ జోడీగా కనిపించనున్నారు. ఒరిజినల్‌లో అమితాబ్ చేసిన పాత్రను తమిళంలో అజిత్ చేస్తున్నారు. హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. “తమిళ ప్రేక్షకులకు విద్యా బాలన్‌ను పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. ఆమె అజిత్‌కు జోడీగా నటిస్తున్నారు. ఆమెది చాలా స్పెషల్ రోల్. శ్రద్ధా శ్రీనాథ్ ఒక కీలక పాత్ర చేస్తోంది. చాలా ముఖ్యమైన పాత్రను రంగరాజ్ పాండే పోషిస్తున్నారు” అని బోనీ కపూర్ తెలిపారు. ‘పింక్’లో తాప్సీ, కీర్తి కుల్హరి, ఆండ్రియా తరియాంగ్ నాయికలుగా నటించారు. ఆండ్రియా తమిళంలోనూ చేస్తోంది. కీర్తి పాత్రను అభిరామి వెంకటాచలం చేస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి ఒరిజినల్‌లో తాప్సీ చేసిన పాత్రను రీమేక్‌లో శ్రద్ధా శ్రీనాథ్ చేస్తున్నట్లు అవగతమవుతోంది. మే 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నారు. అజిత్‌తో ఆయన మరో సినిమానీ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.