Prema Katha Chitram 2: Release Date Announced


Prema Katha Chitram 2: Release Date Announced

ఫిబ్రవరి 22న వస్తున్న ‘ప్రేమ‌క‌థాచిత్రమ్ 2’

సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా నటిస్తోన్న ‘ప్రేమకథాచిత్రమ్ 2’ ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ‘ప్రేమకథాచిత్రమ్’ను అందించిన ఆర్.పి.ఎ. క్రియేషన్స్ అధినేత ఆర్. సుదర్శన్‌రెడ్డి ఈ చిత్రాన్నీ నిర్మిస్తున్నారు. నందితా శ్వేత ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రం ద్వారా హరికిషన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే శాటిలైట్, హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌ ద్వారా రూ. 1.43 కోట్లను ఈ సినిమా దక్కించుకోవడం విశేషం. సూప‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా, మొద‌టి పార్ట్‌కి ధీటుగా ఈ సినిమా వస్తోందనీ, నందిత శ్వేత న‌ట‌న ప్ల‌స్ అవుతుందనీ నిర్మాత తెలిపారు. “ఈ చిత్రానికి మరో ఆకర్షణ రావు రమేష్. ఆయన నటనకే కాకుండా వాయిస్‌కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం రావు రమేష్ వాయిస్ ఓవర్‌తో నడుస్తుంది. విద్యుల్లేఖ, ప్ర‌భాస్ శ్రీను మ‌ధ్య వ‌చ్చే కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. షూటింగ్ పూర్త‌యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి  స‌న్నాహాలు చేస్తున్నాం” అని ఆయన చెప్పారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాం ప్రసాద్, ఎడిటింగ్: ఉద్ధవ్ య‌స్‌.బి, సంగీతం: జె.బి, డైలాగ్స్: గ‌ణేష్‌, పాటలు: అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్‌, పూర్ణాచారి, ఆర్ట్: కృష్ణ‌, సహ నిర్మాతలు: ఆయుష్ రెడ్డి, ఆర్.పి. అక్షిత్ రెడ్డి.