Quiz: How Well Do You Know The Nandi Awards?


Quiz: How Well Do You Know The Nandi Awards?

క్విజ్: నంది అవార్డుల గురించి మీకెంత తెలుసు?

1. నంది అవార్డులు ప్రారంభమైన 1964 సంవత్సరపు ఉత్తమ చిత్రం

ఎ) మూగ మనసులు

బి) డాక్టర్ చక్రవర్తి

సి) అమరశిల్పి జక్కన

2. తొట్ట తొలి నంది అవార్డు అందుకున్న ఉత్తమ నటుడు

ఎ) అక్కినేని నాగేశ్వరరావు

బి) ఎన్టీ రామారావు

సి) ఎస్వీ రంగారావు

3. 1965లో ప్రవేశపెట్టిన ఉత్తమ కథా రచయిత అవార్డు పొందిన వ్యక్తి

ఎ) మాదిరెడ్డి సులోచన

బి) యద్దనపూడి సులోచనారాణి

సి) వాసిరెడ్డి సీతాదేవి

4. 1970 ఉత్తమ చిత్రం ‘కథానాయిక మొల్ల’ నిర్మాత

ఎ) పద్మనాభం

బి) ఎన్. త్రివిక్రమరావు

సి) నిడమర్తి పద్మాక్షి

5. 1975లో ముళ్లపూడి వెంకటరమణ అందుకున్న అవార్డు

ఎ) ఉత్తమ కథా రచయిత

బి) ఉత్తమ సంభాషణల రచయిత

సి) ఉత్తమ ద్వితీయ చిత్రం (ముత్యాల ముగ్గు)

6. ‘పునాది రాళ్లు’ (1979) చిత్రంలో నటనకు ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న నటుడు

ఎ) గోకిన రామారావు

బి) చిరంజీవి

సి) నరసింహరాజు

7. ఉత్తమ గీత రచయితగా శ్రీ శ్రీకి అవార్డు తెచ్చిన చిత్రం

ఎ) కలియుగ మహాభారతం

బి) ఆత్మీయులు

సి) నేటి భారతం

8. ‘సీతారామయ్య గారి మనవరాలు’ చిత్రానికి వచ్చిన అవార్డు

ఎ) ఉత్తమ సంగీత దర్శకుడు

బి) ఉత్తమ దర్శకుడు

సి) ఉత్తమ సంభాషణల రచయిత

9. 1992లో చిరంజీవికి ఉత్తమ నటుడి అవార్డు తెచ్చిన చిత్రం

ఎ) ఘరానా మొగుడు

బి) ఆపద్బాంధవుడు

సి) ముఠా మేస్త్రి

10. 2000 సంవత్సరానికి పూరి జగన్నాథ్ అందుకున్న అవార్డు

ఎ) ఉత్తమ దర్శకుడు

బి) ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత

సి) ఉత్తమ కథా రచయిత

జవాబులు: 1. డాక్టర్ చక్రవర్తి  2. అక్కినేని నాగేశ్వరరావు  3. యద్దనపూడి సులోచనారాణి  4. పద్మనాభం  5. ఉత్తమ ద్వితీయ చిత్రం (ముత్యాల ముగ్గు)  6. గోకిన రామారావు  7. నేటి భారతం  8. ఉత్తమ దర్శకుడు  9. ఆపద్బాంధవుడు  10. ఉత్తమ కథా రచయిత