Raashi Khanna To Seen Opposite Vijay Sethupathi
విజయ్ సేతుపతి సరసన రాశీ ఖన్నా
విజయ్ సేతుపతి కథానాయకుడిగా విజయా ప్రొడక్షన్స్ సంస్థ ఒక తమిళ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి విజయ్ చందర్ దర్శకుడు. 2018 అక్టోబర్ 23న ఈ సినిమాని ప్రకటించారు నిర్మాత బి. వెంకట్రామరెడ్డి. 2019 ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్తున్నట్లు అప్పుడే ప్రకటించారు. అయితే ఇప్పటివరకు హీరోయిన్ ఎవరనేదీ తెలుపలేదు. తాజాగా హీరోయిన్ కేరక్టర్‌ను రాశీ ఖన్నా చేస్తున్నట్లు తమ ట్విట్టర్ పేజీ ద్వారా ప్రకటించారు. ప్రొడక్షన్ నంబర్ 6గా దీన్ని నిర్మిస్తున్నారు. ‘వివివి’ (విజయా ప్రొడక్షన్స్, విజయ్ సేతుపతి, విజయ చందర్) అనే పేరును వర్కింగ్ టైటిల్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట డి. ఇమాన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నా, ఇప్పుడు ఆయన స్థానంలో యువ సంగీత ద్వయం వివేక్ శివ, మెర్విన్ సాల్మన్‌ను తీసుకున్నారు.