Rajamouli’s RRR: The Leading Ladies To Be Announced Soon?


Rajamouli's RRR: The Leading Ladies To Be Announced Soon?

ఆర్ఆర్ఆర్: త్వరలోనే హీరోయిన్ల పేర్లు వెల్లడి

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) సినిమా రెండో షెడ్యూల్ నేడు (జనవరి 21న) ప్రారంభమైంది. తొలిగా చిత్రంలోని 27వ సన్నివేశాన్ని చిత్రీకరించారు రాజమౌళి. దీనికి సంబంధించిన క్లాప్‌బోర్డును నిర్మాతలు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమౌళి ఆస్థాన ఛాయాగ్రాహకుడు కె.కె. సెంథిల్‌కుమార్ ఈ సినిమాకీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అర్రి అలెక్సా ఎల్ఎఫ్, అర్రి సిగ్నేచర్ ప్రైం లెన్స్‌లతో చిత్రీకరిస్తున్న దేశంలోని తొలి చిత్రాల్లో ఇదొకటని ఈ సందర్భంగా సెంథిల్ తెలిపాడు.

Rajamouli's RRR: The Leading Ladies To Be Announced Soon?

స్వల్ప కాలం జరిగిన తొలి షెడ్యూల్ తర్వాత కుమారుడు కార్తికేయ పెళ్లి కారణంగా షూటింగ్‌కు తాత్కాలిక విరామం ఇచ్చారు రాజమౌళి. ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తయిపోవడంతో తిరిగి నేటి నుంచి షూటింగ్‌లోకి వచ్చేశారు. తెలుగు చిత్రసీమలోనే అత్యంత క్రేజీ ప్రాజెక్టుగా, ఇద్దరు టాప్ మాస్ స్టార్లు కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్లు ఎవరనేదీ వెల్లడి కాలేదు. షూటింగ్ రెండో షెడ్యూల్లోకి కూడా వచ్చేసింది కాబట్టి అతి త్వరలోనే హీరోయిన్ల విషయంలో సస్పెన్స్‌కు తెర దించేయాలని రాజమౌళి భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఒక హీరోయిన్‌గా కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసినట్లు అంతర్గత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరికి జోడీ అనేది మాత్రం తెలియలేదు. మరో హీరోయిన్ రోల్ ఎవరికి దక్కుతుందో చూడాలి. ఏదేమైనా కొద్ది రోజుల్లోనే వాళ్ల పేర్లను నిర్మాతలు ప్రకటించనున్నారు. 2020 వేసవికి ఈ సినిమా విడుదలవుతుందనేది ప్రాథమిక సమాచారం.