Ratsasan Telugu Remake: Bellamkonda Srinivas To Play The Lead


Ratsasan Telugu Remake: Bellamkonda Srinivas To Play The Lead

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘రాక్షసన్’ రీమేక్

విష్ణు విశాల్ హీరోగా నటించగా గత ఏడాది తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘రాచ్చసన్’ (రాక్షసన్) సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విష్ణు విశాల్ చేసిన పోలీసాఫీసర్ పాత్రను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ పోషించనున్నట్లు సమాచారం. రాంకుమార్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. కుర్చీల్లో మునివేళ్లపై కూర్చోబెట్టిన బెస్ట్ థ్రిల్లర్‌గా విమర్శకుల ప్రశంసలు పొందింది. జిబ్రాన్ అందించిన రీ రికార్డింగ్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్. విష్ణు విశాల్ జోడీగా అమలా పాల్ నటించింది. తెలుగులో ఈ సినిమాను రమేశ్‌వర్మ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. హీరో నితిన్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం నిర్ధారణ కాలేదు. గత ఏడాది బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిరాశ చెందాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హిట్టయిన ‘రాక్షసన్’ అయితే మినిమం గ్యారంటీ ఉంటుందనే అభిప్రాయంతో ఆ సినిమా రీమేక్‌ను ఎంచుకున్నాడు.