Really Tarak Is A Tiger: Akhil


నిజంగా తారక్ ఒక టైగర్: అఖిల్

జూనియర్ ఎన్టీఆర్‌ని తాను టైగర్ అని పిలుస్తాననీ, నిజంగా ఆయన టైగరేననీ అన్నారు అఖిల్ అక్కినేని. ఆయన కథానాయకుడిగా నటించిన ‘మిస్టర్ మజ్ను’ ప్రి రిలీజ్ ఫంక్షన్ జనవరి 19న హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు తారక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ “తమన్ హిట్ మీద హిట్ ఇస్తున్నాడు. ‘తొలిప్రేమ’, ‘అరవింద సమేత’, ఇప్పుడు ‘మిస్టర్ మజ్ను’. ఇందులో ఆరు చక్కని పాటలిచ్చాడు. అన్ని పాటలకూ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఆయన ప్రతి పాటకూ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి పదేళ్ల క్రితం నుంచే నాకు ఫ్రెండ్. మూడేళ్ల క్రితమే ఈ స్క్రిప్టు చెప్పాడు. ‘వెంకీ.. ఇది నా మూడో సినిమాకు కరెక్టనిపిస్తోంది. వెయిట్ చేస్తావా?’ అనడిగితే నిజంగా వెయిట్ చేశాడు. తను గుండెల్లో నాగ్ ఫ్యాన్. ఇవాళ మా అన్నయ్య (నాగచైతన్య) నాకన్నా యంగ్‌గా ఉన్నాడెందుకో! నా సపోర్ట్ సిస్టం, నా మెంటర్, నా ఫ్రెండ్, నా ఓల్డర్ బ్రదర్ నా ఫాదరే. (జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి) నేను ఆయన్ని టైగర్ అని పిలుస్తాను. నిజంగా ఆయన టైగరే. ఆయన ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చెయ్యలేరు. ఆయన్ని తారక్ గారంటే తట్టుకోలేడు. తారక్ గారని పిలిస్తే ‘ఏంట్రా బలిసిందా? ఫార్మల్‌గా ఉంటావేంటి నాతో’ అంటాడు. తారక్ ఇక్కడకు వచ్చినందుకు హ్యాపీ. ఈ ప్రోగ్రాంకు రావడం నాపై తనకున్న ప్రేమకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అన్నాడు. అభిమానులే మా ధైర్యం, మా ఎనర్జీ” అన్నారు. నిధి అగర్వాల్ నాయికగా నటించిన ఈ సినిమా జనవరి 25న విడుదలవుతోంది.