RRR Satellite Rights: Rajamouli’s Much Anticipated Film Beats Rajinikanth Starrer 2.0


RRR Satellite Rights: Rajamouli's Much Anticipated Film Beats Rajinikanth Starrer 2.0
RRR Satellite Rights: Rajamouli’s Much Anticipated Film Beats Rajinikanth Starrer 2.0

శాటిలైట్ హక్కుల విషయంలో ‘2.0’ను దాటిన ‘ఆర్ఆర్ఆర్’

యస్.యస్. రాజమౌళి సినిమా ‘బాహుబలి 2’ వచ్చి రెండేళ్లవుతోంది. ఇప్పటికీ దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దాని రికార్డు చెదిరిపోలేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఅర్, రాంచరణ్ హీరోలుగా ఆయన రూపొందిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు మార్కెట్‌లో ఇదివరకెన్నడూ లేని క్రేజ్ కనిపిస్తోంది. దాని శాటిలైట్ హక్కుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. తెలుగులోని ఇద్దరు అగ్ర కథానాయకులు కలిసి నటిస్తుండటం, దేశంలోని టాప్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటం వల్ల శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. రజనీకాంత్, అక్షయ్‌కుమార్ సినిమా ‘2.0’ కంటే ఎక్కువ ధరకు ఆ హక్కులు అమ్ముడైనట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అది నిజమేనని అంతర్గత వర్గాలు చెప్పాయి. ‘2.0’ శాటిలైట్ హక్కులు రూ. 110 కోట్లకు అమ్ముడవగా, ‘ఆర్ఆర్ఆర్’ హక్కులు రూ. 130 కోట్లకు పైగా ధరకు అమ్ముడైనట్లు అవి తెలిపాయి. విశేషమేమంటే ఈ సినిమా షూటింగ్ ప్రాథమిక దశలోనే ఉంది. రెండో షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. హీరోయిన్ల పేర్లే ఇంతవరకు ఫైనలైజ్ కాలేదు. అయినప్పటికీ బిజినెస్ వర్గాల్లో ఇంతటి క్రేజ్ సంపాదించుకోవడం అసాధారణం. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానున్నది.