Saaho Director And Bunny Combo?


Saaho Director And Bunny Combo?
Saaho Director And Bunny Combo?

స్టైలిష్ స్టార్‌తో ప‌రుగులెట్టిస్తాడా?

Saaho Director And Bunny Combo?

శ‌ర్వానంద్‌ను ‘ర‌న్ రాజా రన్‌’తో ప‌రుగులెట్టించి క‌మ‌ర్షియ‌ల్ హీరోగా నిల‌బెట్టిన ద‌ర్శ‌కుడు సుజిత్‌. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌భాస్ ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌డానికి నిర్మాణ సంస్థ యు.వి.క్రియేష‌న్స్ ప్లాన్ చేస్తోంది. కాగా.. ‘సాహో’ త‌ర్వాత సుజిత్ మ‌రో స్టార్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నాడని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఆ స్టార్ హీరో మరెవ‌రో కాదు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. బ‌న్నిని రీసెంట్‌గా క‌లిసిన సుజిత్ త‌నకొక లైన్ వినిపించాడ‌ట‌. లైన్ విన‌గానే బ‌న్నీకి నచ్చిందట. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి వినిపిస్తే త‌న నిర్ణ‌యం చెబుతాన‌ని అన్నాడ‌ట‌. ఇప్పుడు సుజిత్ ‘సాహో’ మిగిలిన ప‌నితో పాటు బ‌న్ని స్క్ర్రిప్ట్‌ను సిద్ధం చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ట‌. అలాగే బ‌న్ని కూడా త్రివిక్రమ్ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రూ వారి ప్ర‌స్తుత క‌మిట్‌మెంట్స్ పూర్తి చేసుకున్న త‌ర్వాత‌నే వారి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంది.