Shruti Haasan To Settle In Life In 2019?


Shruti Haasan To Settle In Life In 2019?

త్వరలో శ్రుతి హాసన్ పెళ్లి?

అందాల తార శ్రుతి హాసన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా?.. తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో ఆమె చేసిన ఒక పోస్ట్ దానినే సూచిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. “We are the gushiest most annoying people we swore we would never become” అంటూ తన సహచరుడు మైఖెల్ కొర్సాలేతో కలిసి దిగిన ఫొటోను జత చేశారు. యూరప్‌కు చెందిన నటుడు మైఖెల్‌తో ఆమె కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన ఆ పోస్ట్ త్వరలో తాము పెళ్లితో ఒక్కటవబోతున్నామనే సందేశాన్ని ఇస్తోందని నెటిజన్లు ఊహిస్తున్నారు. బహుశా కొద్ది రోజుల్లో ఈ విషయంపై మరింత క్లారిటీని ఆమె ఇవ్వవచ్చు. మరో వైపు కెరీర్ పరంగా చూస్తే శ్రుతి చేతిలో సినిమాలేవీ లేవు. ఒక్కసారిగా ఆమెకు సినీ అవకాశాలు లేకుండా పోవడం గమనార్హం. ప్రస్తుతం ఆమె తమిళంలో ఒక టీవీ షో చేస్తున్నారు.