Sundeep Kishan In A Sports Drama

క్రీడా నేపథ్య చిత్రంలో సందీప్ కిషన్
సందీప్ కిషన్ వరుస సినిమాలతో, వాటి ఫలితాలతో ప్రమేయం లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తెలుగులో ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమాను చేస్తున్న సందీప్ మరో సినిమాకు ఓకే చెప్పారు. ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రంతో అందరి మెప్పుపొందిన సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమా క్రీడా నేపథ్యంలో ఉండబోతోందని తెలిపారు. భారతంలో ఏకలవ్యుడి నుంచి బొటనవేలు గురుదక్షిణగా తీసుకున్న ద్రోణాచార్యులు కథ తెలియని వారు ఉండరు. ఆ కథనే స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు తెలియజేసారు.
‘కార్తికేయ’ సినిమాను నిర్మించిన వెంకట శ్రీనివాస్ బొగ్గరమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెలువడనున్నాయి.