Tamil Hero Arya To Marry ‘Akhil’ Fame Sayyeshaa On 10 March In Hyderabad

సయేషాను పెళ్లాడనున్న ఆర్య
తెలుగులో ‘అఖిల్’ సినిమాలో అఖిల్‌తో పాటు పరిచయమైన సయేషా సైగల్ త్వరలో పెళ్లె పీటలపైకి ఎక్కనుంది. ఆమె పెళ్లాడనున్నది మరెవరినో కాదు, ప్రముఖ తమిళ నటుడు ఆర్యని. అనేక డబ్బింగ్ సినిమాలతో పాటు ‘వరుడు’, ‘సైజ్ జీరో’ సినిమాలతో ఆర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. మార్చి 10న ఆ ఇద్దరి పెళ్లి హైదరాబాద్‌లో జరుగుతుందని సమాచారం. సయేషా వయసు 21 సంవత్సరాలు కాగా, ఆర్య వయసు 38 ఏళ్లు. తమిళ చిత్రం ‘ఘజినీకాంత్’లో హీరో హీరోయిన్లుగా నటించేప్పుడు ఒకరికొకరు పరిచయమైన వాళ్లు, ప్రేమలో పడ్డారు. గత ఏడాది, ‘ఎంగ వీటు మాపిళ్లై’ అనే టీవీ రియాలిటీ షో ద్వారా ఆర్య వార్తల్లో నిలిచాడు. కారణం అది స్వయంవరానికి సంబధించిన షో కావడం. తనకు కావాల్సిన వధువు కోసం ఆ షో చేసిన ఆర్య, అందులో ఫైనలిస్టులుగా నిలిచిన వాళ్లలో ఎవరినీ పెళ్లాడేందుకు సిద్ధపడలేదు. బాలీవుడ్‌కు చెందిన లెజెండరీ నటులు దిలీప్‌కుమార్, సైరా బాను దంపతులకు సయేషా మనవరాలవుతుంది. సాధారణంగా కూతురితో పాటు సెట్స్‌కు వచ్చే సయేషా తల్లి షనీన్ బాను సైతం ఆర్య ప్రవర్తన బాగా నచ్చేసి వాళ్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆర్య, సయేషా.. ఇద్దరూ సూర్య సినిమా ‘కాప్పాన్’లో కనిపించనున్నారు.