The Great Khali To Make His Tollywood Debut With ‘Narendra’


The Great Khali To Make His Tollywood Debut With 'Narendra'
The Great Khali To Make His Tollywood Debut With ‘Narendra’

టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న ‘ద గ్రేట్ ఖలి’

పంజాబ్‌కు చెందిన రెజ్లర్ ‘ద గ్రేట్ ఖలి’ టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. సీనియర్ డైరెక్టర్ జయంత్ సి. పరాన్జీ డైరెక్ట్ చేస్తున్న ‘నరేంద్ర’ సినిమాలో తన నిజ జీవిత పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా జయంత్ తెలియజేశారు. షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తోందనీ, ఇది యాక్షన్ థ్రిల్లర్ అనీ ఆయన చెప్పారు. డబ్ల్యుడబ్ల్యుఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్) సూపర్‌స్టార్ అయిన ఖలికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. 7 అడుగుల పైగా ఎత్తుండే 46 ఏళ్ల ఖలి 2007లో డబ్ల్యుడబ్ల్యుఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా నిలిచాడు. అతని అసలు పేరు దలీప్ సింగ్ రాణా. ప్రొఫెషనల్ రెజ్లర్ కాకముందు పంజాబ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు. కాగా ‘నరేంద్ర’ సినిమాలో హీరో ఒక రెజ్లర్. అతనితో ఖలి తలపడే సన్నివేశాలున్నాయని తెలుస్తోంది. టైటిల్ రోల్‌ను కొత్త నటుడు నీలేశ్ పోషిస్తున్న ఈ చిత్రంలో ‘మిస్టర్ మజ్ను’ ఫేమ్ ఐజాబెల్లే లీటే హీరోయిన్.

The Great Khali To Make His Tollywood Debut With 'Narendra'
The Great Khali To Make His Tollywood Debut With ‘Narendra’